Hero Manchu Vishnu : మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అప్పట్లో ఢీ సినిమాతో హీరోగా నిలదోక్కుకున్నాడు. ఇక చివరగా దూసుకెళ్తా సినిమాతో హిట్ అందుకున్న మంచు విష్ణు చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న ఆయన తాజాగా ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమా కన్నప్ప. శివుడి భక్తుడిగా మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటించగా భారీ బడ్జెట్ అలాగే భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా మీద పలు విమర్శలు వచ్చాయి. తాజాగా మంచు విష్ణు పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటు సినిమా గురించిన అంశాలను చర్చిస్తూ అలానే తన కుటుంబానికి సంబంధించిన పలు కాంట్రవర్సీ అంశాల గురించి నోరువిప్పారు .

మెగా కుటుంబంతో విబేధాలు…
తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన ఎవరికైనా మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీ కి మధ్య ఉన్న సంబందాలు ఏంటో తెలుసు. అయితే రెండు కుటుంబాల నుండి ఎవయు ఇంతవరకు ఈ విషయాల గురించి స్పందించింది లేదు. తాజాగా కన్నప్ప సినిమా ప్రొమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న మంచు విష్ణు ఈ విషయం గురించి స్పందించారు.
మా ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు. అవన్నీ మీడియా తన లాభం కోసం కల్పించిన కథలే అంటూ చెప్పారు. మా అధ్యక్ష ఎన్నిక సమయంలో కూడా ప్రకాష్ రాజ్ గారి కి వ్యతిరేకంగా పనిచేసాము అది అక్కడితో అయిపోయిన విషయం ఎపుడైనా కనిపిస్తే మాట్లాడుతా అలాగే ఆయన ఎపుడైనా మెసేజ్ చేస్తుంటారు అంటూ విబేధాల గురించి క్లారిటీ ఇచ్చారు విష్ణు.
Latest Videos :



























