మంచు ఫామిలీ నుంచి వచ్చిన నటుల్లో ప్రస్తుతం కొద్దో గొప్పో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయిన నటుడు ఎవరంటే మంచు విష్ణు అని చెప్పొచ్చు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మంచు విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. పూర్తి గా హాలీవుడ్ టెక్నిషియన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కాజల్ విష్ణు సోదరిగా నటిస్తుంది. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మంచు విష్ణు ఈ చిత్ర ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుండగా తాజగా ఓ ఆసక్తికర విషయం చెప్పాడు..
తనకి పిల్లలంటే చాలా ఇష్టం అని.. అందుకే నలుగురు పిల్లల్ని కన్నానని.. ఇంకా పిల్లల్ని కనాలని ఉన్నా తన భార్య ఒప్పుకోలేదంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.విన్నీ నాలుగో నెల గర్భిణిగా ఉన్నప్పుడు జగన్ అన్న దగ్గరకు వెళ్లి.. అన్నా షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ చైల్డ్ అని అంటే.. స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్.. మీకు పిల్లలు చాలు ఇంక కనకండి అని అన్నారు. అందరం కలిసి తెగ నవ్వుకున్నాం. నాకు పిల్లలంటే విపరీతమైన ఇష్టం. నాలుగో బిడ్డ పుట్టిన తరువాత నీకు ఇదే లాస్ట్.. ఇంకా కావాలంటే బయట చూసుకో అనేసింది. నా పెద్ద పిల్లలిద్దరికీ ఇప్పుడు ఎనిమిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నారు. అన్నారు..
ఇక ఈ సినిమా తో పాటే విష్ణు ఢీ అంటే ఢీ అనే సినిమా ని శ్రీనువైట్ల కాంబో లో చేస్తున్నాడు. ఢీ సినిమా కి ఇది సీక్వెల్.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం గొప్ప విశేషం అని చెప్పాలి.. గత కొన్ని సినిమా లుగా శ్రీనువైట్ల సినిమాలు అన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. శ్రీనువైట్ల విజయాలకు ఆగడు సినిమా బ్రేక్ వేసింది.. ఆ తర్వాత అయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు.. బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి.. దాంతో చాల గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు.. అటు విష్ణు గ్రాఫ్ కూడా ఏమంత బాగాలేదు. విష్ణుకి 2016లో వచ్చిన ఆడో రకం ఈడో రకం ఆఖరి హిట్టు. ఆ తర్వాత అంతకు ముందు చాలా ఫ్లాపులు పలకరించాయి. దాంతో ఈ ఇద్దరు ఢీ & ఢీ పైనే హోప్స్ పెట్టుకున్నారు. మరి ఈ ఇద్దరి ఆశలను ఈ సినిమా నిలబెడుతుంది చూడాలి..


























