‘మందు’రా బేడి ఫోటో వైరల్… విమర్శలు చేస్తున్న నెటిజన్లు !!

0
238

సాధారణంగా భారతదేశంలో మనకంటూ ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సంస్కృతి, సాంప్రదాయాల వల్లే మనకు ఇతర దేశాల్లో గౌరవం, మర్యాద లభిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం వాటికి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు. మందు తాగుతున్న ఫోటోలను, మందు గ్లాసుల దగ్గర కూర్హ్కున్న ఫోటోలను వైరల్ చేస్తూ నెటిజన్ల చేత చీవాట్లు తింటున్నారు. తాజాగా నటి మందిరా బేడీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వయస్సు 48 సంవత్సరాలైనా మందిరా బేడీ చూడటానికి తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలానే కనిపిస్తుంది. వయస్సు నాలుగు పదులు దాటినా ఆమె అప్పటి లుక్ కు, ఇప్పటి లుక్ కు పెద్దగా తేడా లేదు. అందంగా కనిపించడంతో పాటు ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయడంలో మందిరాకు మందిరానే సాటి. సోషల్ మీడియాలో మందిరా బేడీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
 
మందిరా బేడీ ఫ్యాషన్ డిజైనర్ గా ప్రెజెంటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్‌నెస్ అండ్ ఫ్యాషన్‌కు సంబంధించిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తూ ఉంటుంది.. మందిరా అందాన్ని ఆరాధించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

అయితే తాజాగా #saturdaynightsalrightforfighting పేరుతో బార్ సెటప్ దగ్గర టేబుల్‌పై కూర్చుని ఉన్న ఫోటో మాత్రం అభిమానులకు నచ్చట్లేదు. ఈ ఫోటో ద్వారా మందిరా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుందో తమకు అర్థం కావడం లేదని… యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఫోటోలను మందిరా షేర్ చేయకపోతే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here