కింగ్ నాగార్జున కెరీర్లో అయన అభిమానులందరికీ ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా ‘మన్మధుడు’. ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది తెలుగు ప్రేక్షకులను. అటువంటి సినిమాలో ఈ సినిమాలో కధానాయికగా నటించిన అన్షు అంబానీని కూడా అభిమానుల గుండెల్లో ఇప్పటికే నిలిచిపోయే ఉంటుంది. ఆమె ఆకట్టుకునే నటన, అమాయకమైన చూపులు, మాటలతో అన్షు ఆ సినిమా సమయంలో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఆమె నాగార్జునతో నటించిన “మన్మధుడు”, ప్రభాస్ తో “రాఘవేంద్ర” సినిమాల తర్వాత ఆమె తెలుగులో మాత్రమే కాదు అసలు సినిమాలోనే కనిపించలేదు.

అప్కపుడు కనుమరుగైన అన్ట్షు ఇపుడు లండన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టం లేక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వడానికి మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అన్షు ప్రస్తుతం లండన్లో ఉంటోంది. అయితే లండన్ లో పుట్టిన అన్షు కు మోడలింగ్, ఇండియన్ సినిమాలపై అమితమైన ఆసక్తితో తెలుగు ఇండస్ట్రి వైపు అడుగులు వేసింది. లండన్లో అన్షు ఇపుడు ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here