Manoj -Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక మార్చి మూడవ తేదీ ఫిలింనగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో ఎంతో అంగరంగ వైభవంగా అది కొద్దిమంది సన్నిహితులు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక వీరి వివాహ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి మౌనిక మనోజ్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లి ముగియగానే మంచు లక్ష్మి నివాసం నుంచి కొత్త దంపతులు నేరుగా కర్నూల్ బయలుదేరారు. ఈ విధంగా మనోజ్ తన భార్యను తీసుకొని మొదటిసారి తన అత్తారింటికి భారీ కాన్వాయ్ నడుమ కర్నూలుకు బయలుదేరి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు రోడ్డు మార్గంలోనే పోలీస్ బందోబస్తుతో భారీ కాన్వాయ్ తో కర్నూలు చేరుకున్నారు. ముందుగా ఈ దంపతులు శోభా నాగిరెడ్డి తండ్రి, మౌనిక తాతగారు ఎస్వీ సుబ్బారెడ్డి గారిని కలిసి అతని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆళ్లగడ్డలోని భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి సమాధి వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Manoj -Mounika మీ ప్రేమ ఆశీర్వాదం వల్లే మా పెళ్లి జరిగింది…
ఇలా కర్నూలుకు చేరుకున్న తర్వాత మనోజ్ మొదటిసారి మీడియాతో కూడా మాట్లాడారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ మీ అందరి ప్రేమ ఆశీర్వాదం వల్లే నేను మౌనిక పెళ్లి బంధంతో ఒకటయ్యామని తెలిపారు.ఇక తాను కర్నూలు నుంచి ఆళ్లగడ్డ కడప తిరుపతి ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని,మాపై మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా ఈయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇలా మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Rocking star @HeroManoj1 & #BhumaMounika are heading to Kurnool with a huge convoy!!????????#ManchuManoj #ManojWedsMounika pic.twitter.com/64HGfSMGfe
— MediaMic Tollywood (@MMTollywood) March 5, 2023































