వివాహేతర సంబంధాలు చివరకు ఎంత దూరం తీసుకొస్తున్నాయో ఈ వార్తను చదివితే అర్థం అవుతుంది. ఆమెకు వివాహం అయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎలాగైనా అతడితో ఉండాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను కిడ్నాప్ చేసి.. అతడితో వెళ్లి పోయింది. చివరకు పోలీసులకు ఈ విషయం తెలవడంతో అతడికి కాపాడి.. ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ ఘటన హైదరాబాద్ లోని మౌలాలీ ఆర్టీసీ కాలనీలో చోటుచేసుకుది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్ (31), ఆప్షియా బేగం(24)లకు 2012లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు బస్టాండ్ ఏరియాలోని ఓ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. అతడి భార్య మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే ముషీరాబాద్ చెందిన క్యాటరింగ్ పనులు చేసే ఆసిఫ్ ఆమెకు పరిచయం అయ్యాడు.
వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కుదిరింది. అతడికి కూడా వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె అతడి మోజులో పడిపోయింది. ఓ రోజు అతడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లు ఆమె ఆచూకీ తెలుసుకొని భర్తకు అప్పగించారు. మరో సారి కూడా ఇలానే జరగడంతో మళ్లీ భర్తకు అప్పగించారు. తనకు తన భర్తతో ఉండటం ఇష్టం లేదని.. తనకు విడాకులు కావాలని ఆమె కోరింది. కాని అతడు దానికి ఒప్పుకోలేదు.
దీంతో ఆమె .. భర్తను కిడ్నాప్ చేసి.. ప్రియుడితో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రియుడితో పాటు .. పార్సిగుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్, ఎండి జాఫర్, ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్‌లను ఇందుకు రెడీ చేసి.. షాప్ లో ఉన్న అతడిని బలవంతంగా రెండు బైక్ లపై ముషీరాబాద్ తీసుకెళ్లి మత పెద్దల సమక్షంలో విడాకులు విప్పించుకున్నారు. పోలీసులకు విషయం తెలవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.. మరికొందరు పరారీలో ఉన్నారు.




























