గతంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్… చింతల్ ఆస్తిలోని ఆర్యవైశ్య భవన్ లో అయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మారుతీరావు కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని హత్య చేయించిన కేసులో మారుతీరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తన కూతురిని ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అల్లుడు ప్రణయ్ ని కిరాయి హంతకులతో హత్య చేయించాడు మారుతీరావు. ఈకేసులో బెయిల్ పై బయటకి వచ్చిన మారుతీరావును ఇటీవలే అయన కూతురు ఫిర్యాదుమేరకు కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి రేమండ్ కు పంపించారు. ఆ తరువాత మళ్ళీ బెయిల్ పై వచ్చారు.

ఆరునెలల కిందట విడుదలైన మారుతీరావు అప్పటినుండి కూతురు అమృతను వేధిస్తున్నారు తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం తన పేరున రాస్తాను అని అమృతకు రాయబారం పంపినట్టు సమాచారం. అయితే కూతురు విషయంలో తీవ్ర మనస్తాపంతో ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే కారణం అంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా 2018 సెప్టెంబర్ 14న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భార్యతో పాటు ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ప్రణయ్ ని కత్తులతో నరికి చంపారు. ఈకేసులో 7 నెలలుగా మారుతీరావు వరంగల్ సెంట్రల్ జైలు లో ఉన్నారు. గతేడాది ఏప్రిల్ లో బెయిల్ పై బయటకి వచ్చారు ఇప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా వారం రోజుల క్రిందట మిర్యాలగూడలో ఓ శవం కలకలం రేపింది. మారుతీరావు కు సంబంధిచిన ఒక షెడ్డు లో ఒక కుళ్ళిన శవం కనిపించింది. దీనిపై విచారణ జరుగుతుంది.



























