Medico Preethi suicide : కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి గత బుధవారం డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యా యత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. ఆమెది ఆత్మహత్య కాదు కాలేజీలో ఏదో జరిగింది అంటూ ప్రీతి కుటుంబం ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం ర్యాగింగ్ కు బలైంది. ఇప్పుడు ఆమె కేసులో కొత్తకోణాలు బయటపడుతున్నాయి.

బ్యాగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు…
ప్రీతి ఆత్మహత్య చేసుకుని మరణించిందని పోలీసులు చెబుతున్నా ప్రీతి కుటుంబం సభ్యులు మాత్రం ఏదో జరిగింది, అనుమానాలు ఉన్నాయి అంటూ ఆరోపిస్తున్నారు. ఇక కేసులో ప్రీతి ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వాట్సాప్ మెసేజెస్ అలాగే స్క్రీన్ షాట్స్ ను సేకరించారు. ప్రీతి తన క్లోజ్ ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడింది వంటి విషయాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక ప్రీతి ఇంజక్షన్ చేసుకుని స్పృహ తప్పి పడిపోయిన సమయంలో కూడా ఆమె పక్కనే ఉన్న ఆమె బ్యాగ్ ను కూడా పోలీసులు తీసుకున్నారు.

అందులో కీలకంగా 24 ఐటమ్స్ సేకరించారు. ప్రీతి ఎపుడూ బ్లాక్ బ్యాగ్ ను తన వెంటే పెట్టుకుని ఉంటుంది. ఇక అందులో ఒక వాటర్ బాటిల్ అలాగే ఒక చిప్స్ ప్యాకెట్, ఒక మ్యాంగో జ్యూస్ బాటిల్ దొరికాయి. ఇవి కాక మరికొన్ని ముఖ్యమైన ఐటమ్స్ దొరికినట్లు సమాచారం. ఇక ప్రీతి గూగుల్ లో ఏం సెర్చ్ చేసింది వంటి విషయాల మీద ఫోకస్ చేసారు పోలీసులు.
































