మీనా… అసలు ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరేమో… ఒకప్పుడు తెలుగునాట టాప్ హీరోయిన్, దాదాపు తెలుగు టాప్ హీరోలందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం బ్యూటీతో మాటమే కాదు.. తనదైన నటనతో ఎప్పటికి మర్చిపోలేని ఇమేజ్ సంపాదించుకుంది మీనా. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలెబ్రేటిస్ అందరు ఇళ్లకే మరిమితమయ్యారు. మీనా కూడా లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది.

ఈ క్రమంలో తనకు బాలీవడ్ నటుడు హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ వివాహం జరిగిన తరువాత బెంగళూరు లో ఏర్పాటు చేసిన రిషప్షన్ కు తానూ వెళ్లానని, అదే సమయంలో అతనికి శుభాకాంక్షలు చెప్పానని తెలిపింది. ఆ సమయంలో ఒక అభిమానిగా, అమ్మాయిగా చాలా ఫీల్ అయ్యానని పేర్కొంది. విందులో హృతిక్ రోషన్ ను కలిసిన రోజు తన గుండె బద్దలైనంత పనయ్యిందని తెలిపింది మీనా. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటో ఒకటి తన అభిమానులతో పంచుకుంది మీనా.




































