Meena – Vidhyasagar : హీరోయిన్ మీనా ఇంట పెను విషాదం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. జూన్ 28న మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. లంగ్స్ ఫెయిల్ అవ్వడంతో చికిత్స పొందుతూ చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో అందరూ శోక సముద్రంలో మునిగి పోయారు. అయితే తాజాగా ఒక చానల్ దీని గురించి మరింత సమాచారం, ప్రస్తుతం అక్కడి పరిస్థితుల గురించి నటి, నిర్మాత అయిన కుట్టి పద్మిని గారితో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.

నాలుగు నెలలుగా మనస్పర్థలు…
బాల నటిగా, విలక్షణ నటనతో, నిర్మాత్తగా కుట్టి పద్మిని అందరికీ సుపరిచితమే. ఎక్కువగా తమిళ సినిమాలు చేసిన కుట్టి పద్మిని, బుల్లితెర మీద కూడా పలు సీరియల్స్ నిర్మించింది. తమిళ్, హిందీ భాషలలో పలు సీరియల్స్ నిర్మించి ఎంతోమంది కొత్త నటినటులను వెండితెర కు పరిచయం చేసింది. అయితే కుట్టి పద్మినికి మీనా గారితో కూడా మంచి అనుబంధం వుంది. మీనా విద్యాసాగర్ ల వివాహ బంధం గురించి పద్మిని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ద్వారా ఇలా మాట్లాడారు.. నాకు ఖచ్చితంగా అయితే తెలియదు. యూ ట్యూబ్ సమాచారం ప్రకారం, స్నేహితుల సమాచారం ప్రకారం మీనాకు తన భర్తకు మధ్య గత కొంత కాలంగా మనస్పర్తలు ఉన్నట్టు తెలుస్తోంది. తమ కూతురు నైనికా సినిమాలలో చేస్తుండటం గురించి ఇద్దరిలో అభిప్రాయ భేద్దాలు ఉన్నట్టు సమాచారం. నాలుగు నెలలుగా విద్యాసాగర్ విడిగా బెంగళూరు లో ఉన్నారట, అక్కడ వంటరిగా ఉంటూ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండటం, పావురాలతో ఎక్కువగా సమయం గడపడం కారణంగా ఇలా జరిగింది అంటున్నారు. చివరి సమయంలో చెన్నై కి తీసుకువచ్చి ప్రయత్నించినా విఫలం అయ్యిందని చెప్పారు. మీనా ఈ సమయంలో తన కూతురి కోసం ధైర్యంగా నిలబడాలని కోరుకున్నారు.
































