పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ చిత్రంతో తెలుగు టాలీవుడ్ కు పరిచయమైన నటి మీరా చోప్రా. ఆ తర్వాత వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు రాకనో.. లేక వ్యక్తిగత కారణాల వలనో కొద్దిరోజులుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న మీరాచోప్రా లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ఛాట్ చేసింది. ఈ ఛాటింగ్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు.? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహేష్‌బాబు అని సమాధానమిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరో అభిమాని అడగ్గా.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని చెప్పినందుకు తనను వినడానికి కూడా వీలులేని పదాలతో దూషిస్తున్నారని ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ తారక్ ఫ్యాన్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

‘తారక్… నీ ఫ్యాన్స్ నన్ను వేశ్య, పోర్న్ స్టార్ అసభ్యకరమైన పదాలతో ఇలా వేధిస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతోనే ఇదంతా జరిగింది. నీ ఫ్యాన్స్ నా పేరెంట్స్ కు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నారు. ఇటువంటి ఫ్యాన్స్ తో మీరు విజయం సాధించినట్టు భావిస్తున్నారా?. ఈ విషయంపై మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. చూద్దాం మరి మీరాచోప్రా ఆవేదనకు మన తారక్ ఎలా స్పందిస్తాడో.. అసలు స్పందిస్తాడో లేదో..?!




























