మెగా బ్రదర్.. టాలీవుడ్‌లో ఈ ఇమేజ్ కేవలం ఒక్కరికే సొంతం. ఓ అన్నకి, ఓ తమ్ముడికి మధ్య పుట్టి.. ఆ అన్నదమ్ములు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోలుగా దమ్ము చూపిస్తుంటే.. సంతోషించడమే కాకుండా.. అటు మెగా ఫ్యాన్స్ కీ, ఇటు తన సోదరులకు మధ్య వారధిగా వుంటూ.. సారధిలా కీలకబాధ్యతలు చేపట్టిన మెగా బ్రదర్ నాగేంద్రబాబు. అంతే కాకుండా తాను కూడా చాలా చిత్రాలలో నటుడిగా మంచి మంచి పాత్రలలో నటిస్తూ.. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ, టీవీల్లో సీరియల్స్ తో పాటు జనాదరణ పొందిన కొన్ని ప్రోగ్రామ్స్‌కి జడ్జిగా వ్యవహరిస్తూ సత్తా చాటుకుంటున్నారు నాగబాబు.

అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ, వాళ్ల ప్రేమ కాకుండా ప్రత్యేకంగా తనకంటూ గుర్తింపుని తెచ్చుకోగలిగారు నాగబాబు. అలా తెలుగు సినిమా పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న నాగబాబు నిర్మాతగా గతంలో రామ్ చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ చిత్రం మిగిల్చిన నష్టాలతో తనువు చాలించాలి ఆని నిర్ణయించుకున్నట్లు ఆయనే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదుకోవడంతో మళ్లీ అటువంటి నిర్ణయం మానుకుని.. మనో నిగ్రహం తో నిలబడగలిగానని చెప్పే నాగబాబు మరో సందర్భంలోనూ ఆయనకు అలా చేసుకోవాలని అనుకున్నారట.

ఈ సంగతిని తాజాగా జీ తెలుగులో ఆగష్టు 23న ప్రసారం కాబోతున్న ‘మా బాపూ బొమ్మకు పెళ్లంట’ అనే స్పెషల్ షోలో పాల్గొని తెలియజేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను ఈమధనే విడుదల చేశారు. సుమారు 8 నిమిషాలు పాటు ఉన్న ఈ ప్రోమో చాలా హార్ట్ టచ్చింగ్ గా వుంది. ఆగస్టు 23న బుల్లితెరపై ప్రసారం కాబోతోన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరలవుతుంది. ఈ షోలో మన మెగా బ్రదర్ నాగబాబు రెండోసారి ఎందుకు బలవాన్మరణం చేసుకోవాలనుకున్నారో క్లారిటీగా వివరించారు.

ఈ సందర్భంగా నాగబాబు చిన్నప్పుడు నిహారిక తప్పిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. “ఫ్యామిలీతో కలిసి ఒకసారి న్యూజిలాండ్ వెళ్లాను.. అక్కడ వాడెవడో అచ్చం నాలాగే నల్ల కోటు వేసుకుని వుండడంతో వాడే నేననుకుని వాడితో వెళ్లిపోయింది మా అమ్మాయి నిహారిక. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయేసరికి ఒక్కసారిగా నాకేం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆ టైంలో నాకెలా అనిపించింది అంటే.. దెబ్బకి న్యూజిలాండ్ లో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నాను. వెంటనే వరుణ్‌ని ఇంటికి పంపించేసి.. నేను నా భార్య పద్మ కలిసి చనిపోదామనుకున్నాం. నా కూతురు లేకపోతే మేమిద్దరం బ్రతికుండటం వేస్ట్ అన్నంత పిచ్చ వచ్చేసింది. ఎంతో పుణ్యం చేసుకుంటేనేకానీ పేరెంట్స్ కడుపున ఏంజెల్స్ పుడతారని పెద్దలంటూ వుంటారు. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక’ అంటూ ఎమోషనల్ గా ఫీలయ్యారు నాగబాబు.



























