నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలోకి వస్టారా.? నెటిజన్ ప్రశ్నకు నాగబాబు రిప్లై ‘అదిరింది’.. దటీజ్ మెగా బ్రదర్ !!

0
269

పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పాత ఫొటోలు ఏవి బయటికి వచ్చినా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్​ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ​కు చెందిన ఓ పాత ఫొటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. ఈ ఫొటోలో యంగ్ పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది.

అప్పుడప్పుడే వస్తోన్న మీసం, గెడ్డం.. చందమామలాంటి ఆ ముఖం వాహ్ సూపర్.. ముఖ్యంగా ఆ కళ్లు ఉన్నాయి చూసారూ.. ఆ లుక్స్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే..! లేటెస్టుగా బయటికొచ్చిన ఈ ఫొటోను మీమ్స్ క్రియేటర్స్ విపరీతంగా వాడేస్తూ.. రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. వాటిని చూసి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా “బావగారు బాగున్నారా” చిత్రం షూటింగ్ టైంలోని ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇలాంటి ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి. నేను పెట్టే పిక్స్‌కి గాలరీ నిండిపోవాలంతే.!” అంటూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేసాడు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోకు నెటిజన్ల నుండి బాగానే స్పందన వస్తుంది. ఈ సందర్భంగా నాగబాబునుద్దేశించి.. “జబర్దస్త్ షోలో మీ నవ్వులు మిస్సవుతున్నాం.. మీరు మళ్లీ జబర్దస్త్ షో లోకి వస్తే చూడాలని ఉంది.?” అంటూ ఓ నెటిజన్ ఎంతో ఆసక్తిగా అడగడంతో నాగబాబు వెంటనే స్పందించి ఆ నెటిజన్‌ను నొప్పించకుండా “మీరు నా నుండి కోరుకునేవన్నీ ఎప్పుడూ “అదిరింది” లో ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు అవైలబుల్‌గానే ఉంటాయి” అని “జబర్దస్త్” అనే మాటను ఎక్కడా టచ్ చేయకుండా తెలివిగా రిప్లై ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here