ప్రస్తుతం తెలుగు చలన సీమలో హీరో, హీరోయిన్ల పెళ్లి సంగతులతో సోషల్ మీడియా హోరెత్తి పోతుంది. ఈమధ్యనే యువ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాగా, మరో హీరో నితిన్ పెళ్ళి వార్తలు కూడా వైరలయ్యాయి. టాలీవుడ్ భల్లాలదేవ రానా సంగతి చెప్పనవసరం లేదు. ఆల్ రెడీ తన ప్రేయసితో పెళ్ళి ఎప్పడన్నది చెప్పకనే చెప్పేశాడు. తాజాగా మెగా డాటర్ నిహారిక తనక్కాబోయే భర్తను హగ్ చేసుకుని మరీ ప్రేక్షక లోకానికి పరిచయం చేసేసింది.

సో మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలవ్వబోతుంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందన్నమాట. ఇదే అంశాన్ని మెగా బ్రదర్ నాగబాబు వద్ద ప్రస్తావించగా.. “ఇది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా భారీస్ధాయిలో పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందేమోనని తెలియజేశారు. ఇంతకీ నిహారికకి కాబోయే భర్త ఎవరనే దిశగా ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే..

మెగా ఫ్యామిలీలోకి ఎంటరవ్వబోతున్న ఆ వ్యక్తి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ చైతన్య అని, అతను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్ లోనే అని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పీజీ చేశారని, బిట్స్ పిలానీలో చదువుకున్న అయన ప్రస్తుతం టెక్ మహీంద్రా సంస్థలో పెద్ద హోదాలో ఉన్నట్లు తెలిసింది. ఇక వీళ్ళిద్దరి నిశ్ఛితార్ధం ఆగస్టు నెలలో జరగనుంది. ఆ తర్వాత పెళ్లి వేడుకను వీలైనంత సాధారణ స్ధాయిలోనే నిర్వహించనున్నట్లు ఈమధ్యనే ఈ రెండు కుటుంబాలు కలసి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం.



























