బాలసుబ్రమణ్యం ఆ పేరు వింటేనే పాటల అమృత ఝరి, సుస్వరాల సిరి, సుగంధాల గానలహరి. ఆ పాటల వృష్టిలో తడిసి ముద్దవని భారతీయుడు ఉండడేమో అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. దివి నుంచి భువి పై వర్షపు జల్లులు కురిపించే వరుణ దేవుడికి అలుపు ఉంటదేమో కానీ అమృత బాండాల లాంటి పాటలను అందివ్వడంలో ఎస్పీ బాలు కి అలుపు సొలుపు ఏమీ ఉండదు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి మాత్రమే వెనుకకు తగ్గారు కాని అలసిపోయి మాత్రం కాదన్నది జగమెరిగిన సత్యం
తన పాట కేవలం తెలుగు ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలకు కూడా అందివ్వాలని అలా అన్ని భాషల్లో తాను పాడడం మొదలు పెట్టారు.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న రాయప్రోలు సుబ్బారావు మాటలు ఈ సందర్భంలో గుర్తుకు వస్తుంటాయి.ఏ భాష మాట్లాడినా ఏ పాట పాడిన మరవకురా నీ మాతృభాష తెలుగుభాష.ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ అంతర్జాతీయ వేదికలపై మాతృ భాష గొప్పదనం గురించి అనర్గళంగా మాట్లాడేవారు. బాలు మాట్లాడే విధానం వీక్షకులను అలా కుర్చీలకి హత్తుకు పోయేలా చేస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఆ తీయని పలుకులు ఇంకా మదిలో మెదులుతూనే ఉంటాయి.
ఎస్పీ.బాలసుబ్రమణ్యం పరమపదించిన తరువాత చిరంజీవి సోదరుడు నాగబాబు.. శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో మొదటి పాట పాడిన అంతగా గుర్తింపు రానప్పటికీ ఆ తర్వాత పాడిన ఎన్నో సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. అలా.. ఎన్టీఆర్, ఏ.ఎన్ ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి వారి గొంతులకు సరిపోయే విధంగా పాడేవారని అయితే అన్నయ్య చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎస్పీ.బాలు గారి పాట ఆడియో విన్నామని.. తీరా థియేటర్ కి వెళ్లి చూస్తే అచ్చు అన్నయ్య చిరంజీవి లాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారని ఆ పాట చూసి తామంతా ఆశ్చర్యపోయామన్నారు.

1988లో తాను నిర్మాతగా వ్యవహరించిన రుద్రవీణ సినిమాలో బాలు అన్నయ్యచే పాటలు పాడించచాలనుకున్నాం. ఈ సినిమా ఇళయరాజా సంగీత దర్శకత్వం లో రూపొందింది. “తరలి రాద తనే వసంతం తన దరికిరాని వనాల కోసం అనే పాట జనాల్లోకి ఎక్కువ వెళ్లినప్పటికీ, నేను సైతం విశ్వ వీణకు… అనే పాటకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు జాతీయ ఉత్తమ గాయకుడిగా అలాగే ఇళయరాజాకు కు ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాలు లభించాయి. అని గత స్మృతులను గుర్తుచేసుకుంటు..నాగేంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here