ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దంటూ భారత ప్రధానికే సెటైర్ వేసిన మెగా బ్రదర్ !!

0
362

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తన ఖాళీ సమయాన్నంతా సోషల్ మీడియాకే వెచ్చిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఈమధ్యనే బాలకృష్ణపై సంచలనమైన కామెంట్స్ చేసి మొత్తం టాలీవుడ్ సైతం ఉలిక్కిపడేలా చేసిన నాగబాబు తాజాగా మరో సెన్సేషనల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో నిలిచారు. ఈమధ్య కాలంలో హిందూ పండిట్ అజయ్ అనే వ్యక్తిని కాశ్మీర్ లో హత్య చేశారు.

ఇదే విషయంపై నాగబాబు తనదైన బాణీలో సంచలనమైన కామెంట్స్ చేసి ఈసారి రాజకీయ ప్రముఖులు ఉలిక్కిపడేలా చేశారు. ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.. ఈసారి నాగబాబు ఏకంగా మన భారత ప్రధాని మోదీనే టార్గెట్ చేస్తూ ఓటుబ్యాంక్ రాజకీయాలు మానండి అంటూ సెటైర్ లు వేస్తూ సోషల్ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యకరమైన అంశంగా మారింది. ‘నాకూ నిన్నే తెలిసింది కాశ్మీర్ లో హిందూ పండిట్ అజయ్ అనే సర్పంచిని చంపేశారని.. మరేం ఫరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా.. ఛస్తే మనం ఎవరం ఫీలవ్వనవసరం లేదు. ఎక్కడో కాశ్మీరీ పండిట్, మన చుట్టం కాదు మన రాష్ట్రం కాదు.. ఎంతైనా మనది ఇండియా కదా ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు. కనీసం హిందువులకి, హిందు సంస్థలకైనా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది.

ఈ దేశంలో హిందువుగా పుట్టటం కన్నా ఒక గాడిదగా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నేడు నిజమేమో అనిపిస్తుంది. మోడీ గారూ ఓటుబ్యాంకు రాజకీయాలు వద్దు ప్లీజ్’ అని నాగబాబు సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ ఖాతాలో స్పందించడం ఆసక్తికరంగా మారింది. మరి మన మెగా బ్రదర్ గారి సెటైర్ కి మోడీ గారి స్పందన ఎలా వుంటుందో వేచి చూద్దాం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here