లాక్ డౌన్ లో ఎటువంటి షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపే వారికి ఒకేసారి ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం అంటే కష్టంగానే ఉంటుంది. అయితే సోషల్ మీడియా వేదికగా సెలెబ్రెటీలు అందరు సరదాగా తన అభిమానులతో లైవ్ లో ముచ్చటిస్తున్నారు. ఆ సమయంలో వారి యొక్క కెరీర్ మరియు కుటుంబ విషయాలు సైతం చెబుతూ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో మెగా డాటర్ నీహారిక కొనేదెల…యాంకర్ రవితో పాటు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో లైవ్ లో పాల్గొనడం జరిగింది. ఈ లైవ్ ఇంత హాట్ టాపిక్ అవడానికి అసలు కారణం నిహారిక, రవి సంభాషణలో అక్కినేని కోడలు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తావించడమే…

నీహారిక లైవ్ లో అభిమానులతో తన యొక్క తదుపరి సినిమాలు గురించిన ఆసక్తి కర విషయాలు చెబుతూ ఉండగా… ఒక నెటిజన్ పెళ్లి ప్రస్తావన తెచ్చి, పెళ్లి తర్వాత మీరు నటిస్తారా అని అడిగాడు, దానికి నిహారిక రెస్పాండ్ అవుతూ “నేను ఏమైనా సమంతనా పెళ్లికి ముందే నటిస్తానో లేదు అనే విషయాన్ని ముందుగా చెప్పడానికి..” అని జవాబు చెప్పడంతో ఇపుడు అది హాట్ టాపిక్ గా మారింది.తన వద్దకు వచ్చిన ఆఫర్స్ లో మంచి పాత్రలు ఎంచుకుంటూ నటిస్తాను అంతే కాకుండా ఇక ముందు రాబోయే సినిమాలలో గ్లామరస్ పాత్రలను కూడా చేస్తాను అని వెల్లడించారు.

తన తదుపరి సినీమా తమిళంలో చేస్తున్నట్టు అందులో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయి అని వాటికి సంబందించిన షూటింగ్ అంతా గోవా లోని మోస్ట్ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ మరియు బీచ్ పరిసర ప్రాంతాల్లో చేయనున్నట్లు తెలిపింది. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల సాంప్రదాయ దుస్తులలోనే ఇపటివరకు కనిపించినా ఇక మీదట గ్లామర్ పాత్రలో మెరవబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. వాటికి సంబందించిన హాట్ ఫోటోస్ ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.


































