మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. తొలి సినిమా తోనే ఈ రేంజ్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. ఎంతో అదృష్టం చేసుకుని ఉంటె కానీ ఈ రేంజ్ లో హిట్ దక్కదు.. ఇతర హీరోలు హిట్ కొట్టడానికి ఆపసోపాలు పడుతుంటే వైష్ణవ్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా సూపర్ హిట్ కొట్టాడు.. ఎంతో న్యాచురల్ గా సినిమా తెరకెక్కగా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు.
తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. ప్రేక్షకులే కాదు పెద్ద పెద్ద వారు సైతం వైష్ణవ్ ని పొగిడారు.. మెగా హీరోల్లో తనకంటూ మంచి మార్కెట్ చేసుకున్న హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఉంటాడని అన్నారు.. ఇక తాజగా చిరంజీవి వైష్ణవ్ కి మెగా గిఫ్ట్ అందించాడు. మొదటినుంచి చిరంజీవి తన సినిమాకి పనిచేసిన వారికి గిఫ్ట్ లు పంపడం జరుగుతుంది. తన సినిమాలకే కాకుండా ఇతర సినిమాల్లో బాగా పనిచేసేయినవారికి గిఫ్ట్ లు ఇస్తుంటారు.
అలా ఉప్పెన సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ, డైరెక్టర్ బుచ్చి బాబు మరియు హీరోయిన్ కృతి శెట్టికి చిరంజీవి అభినందన లేఖలు, చిరు గిఫ్ట్ లు పంపించారు. తాజాగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి చిరంజీవి బహుమతి ఇచ్చారు. అందమైన ఓ కాస్ట్లీ వాచ్ ని వైష్ణవ్ కి ఇవ్వడం జరిగింది.దీనితో వైష్ణవ్ ఉబ్బితబ్బిబయ్యాడు. తన ఆనందాన్ని వైష్ణవ్ తేజ్.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చిరుతో దిగిన ఫొటోతో పాటు థాంక్ యూ మామయ్య అంటూ కామెంట్ చేశాడు. వైష్ణవ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























