మెగాస్టార్ చిరంజీవి తరవాత అయన ఫ్యామిలీనుంచి చాలామంది హీరోలుగా వచ్చారు.. వీరంతా చిరువేసిన బాటలోనే నడుస్తున్నారు. అంతేకాదు కొన్ని సినిమాలో చిరు ఫోటోలు, డైలాగులు, పాటలు మొదలగునవి వీరి సినిమాలో పెట్టుకుంటూ మెగాస్టార్ క్రేజ్ ను వాడుకుంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే..

చిరు పాటలను వాడుకోవడంలో ముందుండే హీరో అయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా “రేయ్” నుంచే చిరంజీవి పాటలను రీమిక్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ధరమ్ తేజ్ చిరుకు సంబంధించిన నాలుగు పాటలు రీమక్స్ చేసాడు. అందులో రేయ్ లో “గోలీమార్”, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో “గువ్వా గోరింకతో”, సుప్రీంలో “అందం హిందోళం”, ఇంటెలిజెంట్ లో “చమక్ చమక్ చాం” పాటలను రీమిక్స్ చేసాడు. ఈ పాటలలో గువ్వా గొరికంతో.. అందం హిందోళం.. పాటలు తప్పితే మిగిలిన పాటలకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

మరో పక్క మెగా అభిమానులు సైతం చిరు ఎవర్ గ్రీన్ పాటలను సాయి ధరమ్ తేజ్ పాడు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తేజ్ ఇకపై చిరు పాటలను రీమిక్స్ చేయకుండానే నిర్ణయించుకున్నాడట. మే 1 న “సోలో బ్రతుకే సో బెటరు” సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. మరి కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనేది సందేహంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here