మెగా ప్రిన్సెస్, కొణిదెల నాగబాబు గారాపట్టి, నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో జరిగిన విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత ఆమె సోషల్ మీడియా లో కనిపించడం గతం కంటే ఎక్కువ చేసిందని చెప్పొచ్చు.. భర్త తో ఉన్న మధుర క్షణాలను సోషల్ మీడియా లో పంచుకుంటూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.. నిజానికి పెళ్లి టైం లోనే నిహారిక సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది. అప్పటినుంచి రోజుకో ఫోటో తో సోషల్ మీడియా అభిమానుల అలరిస్తుంది..

తాజగా నిహారిక తన కాలికి గాయం అయిన విషయాన్నీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా చెప్తూ దాన్ని తన భర్త ఎలా ప్యాంపర్ చేశాడు అన్న విషయాన్నీ చెప్పేసింది.. తన ఇంస్టా స్టోరీ లో ఓ చిన్ని వీడియో ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసింది నిహారిక.. ఈ వీడియో లో ఆమె గాయమైన కాలికి బ్యాండేజ్ కట్టి ఉండగా భర్త చైతన్య దూరంగా తన ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.. అమ్మాయిని కాలుకింద పెట్టనీయకుండా చూసుకుంటాను అనే డైలాగ్ లాగ చైతన్య నిహారిక ను అలా చూసుకుంటున్నాడని ప్రపంచానికి తెలియజేయడానికి నిహారిక ఈ పోస్ట్ ద్వారా తెలియపరిచింది కావచ్చు అని అభిమానులు చెప్పుకుంటున్నారు..
ఇక నిహారిక పెళ్లి తర్వాత సినిమాల్లోకి రావాలనే డిమాండ్ ఎక్కువవుతుంది.. పెళ్ళికిముందు సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో, షో లలో కనిపించిన నిహారిక పెళ్లి తర్వాత కూడా నటిస్తూ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.. వాస్తవానికి ఇతర హీరోయిన్ పెళ్లి తర్వాత నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు.. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక అభిమానుల కోరిక ను నెరవేరుస్తుందా అనేది చూడాలి.. సోషల్ మీడియా లో మాత్రం తన అప్ డేట్స్ ని అందజేస్తూ అభిమానులకు ఖుషి చేస్తూనే ఉంది..



































