ఇకపై రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పిన చిరంజీవి మళ్ళీ అటు వెళ్లడమేంటి అని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం అయన మళ్ళీ రాజకీయాలలోకి వెళ్తున్నారు. కానీ రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో… అవును రిల్ లైఫ్ లో పొలిటికల్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. కొరటాల శివ – చిరు కాంబినేషన్లో “ఆచార్య” అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే… అయితే ఈ చిత్రంలో చిరు పాత్రపై ఇప్పటికే అనేక రకాల కధనాలు వచ్చాయి. ఈ సినిమాలో చిరు నక్షల్స్ పాత్ర చేస్తున్నారని, దేవదాయశాఖలో పని చేసే వ్యక్తి పాత్ర అంటూ, పురాతన దేవాలయనాలు కాపాడే ప్రొఫెసర్ అంటూ మరికొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కొరటాల శివ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసారు.

“ఆచార్య” సినిమా పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పేసాడు దర్శకుడు కొరటాల. “ఆచార్య ఒక పొలిటికల్ థ్రిల్లర్… అందులో ప్రకృతి వనరులను కాపాడే ఒక వ్యక్తిగా మెగాస్టార్ పాత్ర ఉంటుంది..” అంటూ కొరటాల శివ చేసిన వ్యాఖలతో ఒక్కసారిగా ఈ సినిమా కథపై ఉన్న అనుమానాలు అన్ని తొలగిపోయాయి.

అయితే గతంలో కొరటాల తెరకేకించిన చిత్రం “జనతా గ్యారేజ్” ఎన్టీఆర్ ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తిగా నటించారు. అయితే ఇప్పుడు చిరంజీవి కూడా ఇటువంటి పాత్రలోనే నటిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడని కన్ఫార్మ్ చేసారు దర్శకుడు కొరటాల. అంతేకాదు ఈ చిత్రంలో చెర్రీకి కూడా హీరోయిన్ ఉంటుందట.

ఇప్పటికే 40 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని, మిగిలిన 60శాతం ఇండోర్ లోనే షూటింగ్ చేస్తామని తెలిపారు కొరటాల. అయితే సినిమా విడుదలపై ఇప్పుడే చెప్పలేనని తేల్చేసారు కొరటాల శివ.




























