Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కష్టపడి సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చాడు. నేటి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకి స్ఫూర్తి. ఆయనకు కోట్లలో అభిమానులున్నారు, అయితే ఆయనంటే గిట్టని వారు కొంతమంది ఉన్నారు. అలా మెగాస్టార్ గా ఎదిగిన చిరు ఎదుగుదలను ఓర్వలేని కొంత మంది ఆయన మరణానికి ప్లాన్ చేసారు. అప్పట్లో చిరు మీద విష ప్రయోగం జరిగింది అంటూ పత్రికల్లో వచ్చిన వార్త మీద స్వయంగా మెగాస్టార్ చిరు ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

వశీకరణ మందు పెట్టాలని అనుకున్నాడు…
అప్పట్లో అవుట్ డోర్ షూటింగులకు వెళితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేది. అలా మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో చెన్నై లో షూటింగ్ జరుగుతున్నపుడు చాలా ఎక్కువ మంది అభిమానులు రావడం, ఆటో గ్రాఫ్ లు ఫోటోలు అంటూ ఎగబడడం జరిగింది. ఇక ఓ అభిమాని కాళ్లపై పడి నా పుట్టినరోజు మీ సమక్షంలో జరుపుకుంటానని కోరగా చిరు సరే అని చెప్పక తప్పలేదు. ఇక కేక్ కటింగ్ తరువాత వద్దని ఎంత చెప్పినా నోట్లోకి కేక్ పెట్టాడట ఒక వ్యక్తి. సాధారణంగా ఎవరైనా చేత్తో పెడితే తినే అలవాటు చిరంజీవి గారికి లేదట.

స్పూన్ తో తినడమే అలవాటు ఉన్న ఆయన అలా చేత్తో పెట్టడంతో వెంటనే ఉమ్మేశారట ఆ కేక్ ను. అయితే అదే సమయంలో రుచి తేడాగా ఉండడంతో వెంటనే దాన్ని ఉమ్మేసి నోరు కడుకున్నారట. కేక్ మధ్యలో ఏదో పౌడర్ ఉన్నట్లు అనిపించింది వెంటనే ఆ కేక్ ను ల్యాబ్ కి పంపించారట. అయితే అందులో ఏదో పౌడర్ కలిపారని తెలియడంతో నిర్మాత కేఎస్ రామారావు గారు ఆ వ్యక్తిని బాగా కొడితే విషం ఎందుకు కలిపావ్ అని అడిగితే అది విషం కాదు చిరు ఇంతకుముందు మా జిల్లా కు సంబంధించి నాతో మాట్లాడేవాడు, ఈ మధ్య వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు అందుకే కేరళ నుండి వశీకరణ మందు తెచ్చి కేక్ లో పెట్టాను అని చెప్పాడట. అయితే తనకు ఎటువంటి హాని కలగలేదని చిరు చెప్పారు.



























