Megastar Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’, చిరంజీవి, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ అదిరిపోయింది. ఫాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్. సినిమాకు సంబందించిన ముచ్చట్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

చరణ్ తండ్రి కావడం ఆనందాన్ని ఇచ్చింది…
2022 చిరంజీవి గారికి ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని అయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయనకు ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ రావడం, ఎక్కడైతే తెలుగు వాడికి అవమానం జరిగిందేదో అక్కడే ఆయన అవార్డు తీసుకోవడం గర్వించదగ్గ విషయం. ఇక కొడుకు రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పెద్ద హిట్ అయి రామ్ చరణ్ కి మంచి పేరు వచ్చింది. ఇక రామ్ చరణ్ కి కూడా యూత్ ఐకన్ గా లెజెండ్రి అవార్డు రావడం మరో సంతోషకర విషయం. ఇక వీటన్నింటికీ మించి రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అన్న విషయం మెగా ఫ్యామిలీలోనూ అలానే అభిమానులకు పెద్ద శుభవార్త.

ఎంతటి మెగాస్టార్ అయిన తాను తన బిడ్డలకు తండ్రి కదా, అందుకే ఇంటికి వారసులు రాబోతున్నారు అనగానే మెగాస్టార్ ఆనందానికి హద్ధులు లేవు. వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక 2022 లో తన కుటుంబంలో అత్యంత శుభవార్త అదేనంటూ చెప్పారు. ఆ శుభవార్త కోసం ఎంతో కాలంగా కుటుంబం మొత్తం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఇంట్లోకి కొత్త వ్యక్తి రాబోతున్నట్లు, రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు చిరు.


































