అప్పట్లో చిరు నటించించిన ఖైదీ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవికి మాస్ లుక్ ను తెచ్చిపెట్టిన సినిమాగా ఖైదీ సినిమా నిలబడిపోతుంది. ఖైదీ సినిమా రిలీజ్ అవ్వకముందు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది. ఖైదీ కంటే ముందు 14 సినిమాలు ఆయన నటించారు. ఖైదీ సినిమా వరకు ఆయనకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అలాంటి సమయంలో అక్టోబర్ 28, 1983 న ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి చిరంజీవికి ఓ గొప్ప స్టార్ గా పేరును తీసుకు వచ్చింది. ఇక అప్పటినుండి మెగాస్టార్ చిరంజీవి క్రమక్రమంగా తన నటజీవిత ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక ఈ ఖైదీ సినిమా తీసే సమయంలో అనేక ఆసక్తికర విషయాలు జరిగాయి. ఇక వాటి గురించి తెలుసుకుంటే…

మొదటగా ఈ సినిమాను మొదలు పెట్టే సమయానికి ఇద్దరు హీరోలను అనుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ముందుగా స్క్రిప్ట్ రెడీ చేయకముందే మెగాస్టార్ చిరంజీవిని అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు ను దృష్టిలో ఉంచుకొని ఓ తమిళ స్టోరీని రాశారు. అయితే తమిళ డైరెక్టర్ చెప్పిన కథ ఆ సినిమా నిర్మాత డాక్టర్ తిరుపతి రెడ్డి కి నచ్చలేదట. ఇక అదే సమయంలో ఫస్ట్ బ్లడ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను చూసిన నిర్మాత తిరుపతి రెడ్డి కి అందులో అనేక పోరాట సన్నివేశాలు ఎంతగానో నచ్చాయి. అయితే ఆ సినిమాలలో అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవి లాంటి హీరోలు చేస్తే చాలా బాగుంటుందని భావించిన తిరుపతి రెడ్డి గారు డైరెక్టర్ కోదండ రామి రెడ్డి గారిని ఆ సినిమా చూడమని చెప్పగా, ఆయన చూసి సినిమా నచ్చిందని తెలిపారు. అయితే ఆ సినిమాను దృష్టిలో ఉంచుకుని చిరంజీవికి తగ్గట్టుగా తెలుగు నేటివిటీకి దగ్గరగా కథను ఎవరు రాస్తారన్న సమయంలో అని ఆలోచిస్తున్న నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ ను ఎంచుకొని కథను డెవలప్ చేయమని అప్పగించారు. ఆ సినిమా కేవలం ఒక్క హీరోనే నటించాల్సిన నేపథ్యంలో ముందుగా అనుకున్న మోహన్ బాబును కాస్తా పక్కకు పెట్టాల్సి వచ్చింది. అయితే, ఆ విషయంలో మోహన్ బాబు సహృదయంతో సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి సినిమా నుంచి వైదొలిగారు.

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో ఉంచుకొని పరుచూరి బ్రదర్స్ ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా కథని తెలుగు తనానికి దగ్గరగా రచించారు. ఈ సినిమాకి హీరోయిన్స్ ఎంపిక విషయానికి వస్తే.. ఆ సమయానికి చిరంజీవితో ఇదివరకు నటించిన మాధవిని మరోసారి చిరంజీవి జంటగా ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా, ఇక మరో హీరోయిన్ స్థానానికి సుమలత ను ఎంపిక చేశారు. ఇక ఆ సినిమాలో ప్రతినాయకుడిగా నూతన ప్రసాద్, రామ్ గోపాల్ రావు గారి ని ఎంచుకున్నారు. ఇలా మొత్తం సభ్యుల్ని నిర్ణయించుకున్న చిత్రబృందం ఎట్టకేలకు సినిమా మొదలుపెట్టారు. ఇక ఖైదీ సినిమా లో వచ్చే ఓ సన్నివేశం గురించి మాట్లాడుకోవాలి. ఆ సన్నివేశంలో హీరో చిరంజీవి అరటి తోటలో పరుగెత్తుతుండగా ఆయన వెంబడి కొందరు మనుషులు అతని చేజ్ చేసే సన్నివేశం. అయితే ఆ షూటింగ్ చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి కాలుకు పెద్ద గాయమే తగిలింది. అది ఎంతలా అంటే ఆ గాయం వల్ల ఏకంగా 20 రోజులు మెగాస్టార్ చిరంజీవి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ 20 రోజులు గడిచిన తరువాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమా షూటింగ్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ఇక తర్వాత షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ తలకోన అడవుల్లో సాగింది. అక్కడ అసలు సమస్య ఏమిటంటే తలకోన అనే ఊరు తిరుపతి నగరానికి కాస్త దూరంగా ఉంది. అయితే సినిమా నిర్మాణంలో భాగంగా కొందరు తలకోనలోని ఉన్న చిన్న చిన్న గదుల్లో ఉండేవారు.

ఇక హీరో, హీరోయిన్ లాంటి పెద్ద క్యారెక్టర్ చేసేవారికి తిరుపతి నగరంలో రూమ్స్ అందించేవారు. అయితే ప్రతిరోజు తిరుపతి నుండి తలకోనకు చేరుకోవాలంటే ప్రయాణం పెద్ద సమస్యగా మారింది. అయితే నిర్మాతల హీరోగా పేరుపొందిన చిరంజీవి నిర్మాతకు ఎక్కువ ఖర్చు కాకుండా ఇబ్బందులు క్రియేట్ చేయకుండా ఉండేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇలాంటి మంచి మనసు కలిగిన చిరంజీవి ఆ సినిమా సమయంలో తాను కూడా మిగతా వారితో పాటు తలకోన లోనే బస చేస్తా అని తెలిపాడు. దీంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో తలకోన లోనే ఓ చిన్న గదిలో నిర్మాత, దర్శకుడు, హీరో చిరంజీవి ముగ్గురు కలిసి కేవలం చాప పై మాత్రమే పడుకొని నిద్రపోయేవారు. ఇలా ఇరవై రోజుల పాటు తలకోన షెడ్యూల్ పూర్తి చేసుకుని ఎట్టకేలకు ఖైదీ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

ఆ సినిమా షూటింగులో భాగంగా జరిగిన సంఘటన నేపథ్యంలో చిరంజీవి అంటే దర్శకులకు ఓ రియల్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుండి అనేక మంది దర్శకులు చిరంజీవిని డైరక్ట్ చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతే కాదు చాలా మంది నిర్మాతలు కూడా ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయని చిరంజీవితో సినిమా తీయాలని క్యూ కట్టారు. ఇక ఈ సినిమాకి ఖైదీ అని నామకరణం చేసింది మాత్రం ఆ సినిమా నిర్మాత డాక్టర్ తిరుపతి రెడ్డి. ఖైదీ సినిమాలో అందరికీ తెలిసిన పాట ‘ రగులుతోంది మొగలిపొద’ అనే పాటకు కూడా తిరుపతి రెడ్డి అడిగి మరి డైరెక్టర్ తో చిత్రీకరించారు. ఇందుకు గల కారణం తిరుపతిరెడ్డి ఓ సమయంలో ఏదో పాట వింటున్న నేపథ్యంలో నాగిని మ్యూజిక్ విని వారి సినిమాలో పాట నాగిని డాన్స్ పాట ఉంచుకోవాలని భావించి ఆ పాటను నిర్మించారు. ఆ తర్వాత ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని హంగులతో ఏకంగా అప్పట్లోనే 25 లక్షల బడ్జెట్ తో ఈ సినిమాను పూర్తి చేశారు. నేటికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 37 సంవత్సరాలు అవుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం మర్చిపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here