చిరంజీవి కనబడకుండా వినపడి.. శతదినోత్సవం జరుపుకున్న సినిమా మీకు తెలుసా..?

0
851

1970 ప్రాంతంలో గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్ళు నాటిక విజయవాడలో ప్రదర్శింపబడింది. ఇలా ఆంధ్ర దేశమంతటా ప్రజాదరణ పొందుతున్న ఈ నాటిక అనతి కాలంలోనే దాదాపు 14 భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఇంకా చెప్పుకోవాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశంగా చేర్చబడింది. నవలలో వచ్చే కథల్ని సినిమాగా తీయడం అనేది ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది.

ఆ క్రమంలో తమిళ దర్శకుడు బాలచందర్ ఈ కథ విని దానిని సినిమాగ తీయాలనుకున్నారు. హిందీ నటుడు మనోజ్ కపూర్ కళ్ళు నాటిక హక్కులు తనకు కావాలని మీరు ఊహించనంత డబ్బు ఇస్తానని గొల్లపూడిని అడిగారు. దానికి గొల్లపూడి నవ్వుతూ నేను ఇదివరకే బాలచందర్ తో ఈ విషయంలో మాట్లాడుతున్నాను. అని చెప్పాడు. చివరికి బాలచందర్ దగ్గర కేవలం 25వేల రూపాయలు తీసుకొని గొల్లపూడి తన నైతికతను చాటుకున్నారు.

బాలచందర్ కళ్ళు సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిపివేశారు. మళ్లీ కళ్ళు హక్కుల్ని డి.రామానాయుడు గారు కొనుగోలు చేశారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. విజయవాడలో కళ్ళు నాటిక ప్రదర్శన చూసి ఎగ్జయిట్ అయినా ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు ఆ నాటిక ను సినిమాగా రూపొందించాలని కోరిక తో దర్శకుడిగా మారాడు.

కళ్లు సినిమా పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్ కాదు అలాని కమర్షియల్ సినిమా కాదు. ఈ సినిమాలో హీరోగా శివాజీ రాజాను మిగతా నలుగురు ప్రధాన పాత్రల్లో కొత్తవారిని తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. తెల్లారింది లేవండోయ్.. పాట ఒక్కటే మిగిలింది.

దర్శక నిర్మాతల దగ్గర మొత్తం డబ్బులు అయిపోయాయి. అత్యంత సంక్లిష్ట పరిస్థితులలో సినిమా పూర్తి చేసి 1988 జూలై లో కళ్ళు అనే సినిమాని విడుదల చేశారు. నాలుగు నంది అవార్డులు గెలుచుకొని శతదినోత్సవం జరుపుకుంది. అయితే ఈ సినిమాలో.. ఓ అందుడికి నీకు ఆపరేషన్ తర్వాత కళ్ళు వస్తే ఏం చేస్తావు అని అడగగా.. నేను చిరంజీవి షూటింగ్ చూస్తాను అంటాడు. ఆ క్రమంలో చిరంజీవి ముఖం కనబడకుండా డూప్ ను పెట్టి వెనుక నుంచి షార్ట్ తీస్తారు. కానీ డబ్బింగ్ మాత్రం చిరంజీవి గారే చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here