Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నెంబర్ వన్ హీరోగా మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలు దుమ్మరేపుతున్న సమయంలో తనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదంటాడు చిరంజీవి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. అంతేకాదు.. తన కెరీర్ లో కాస్త అరుదైన రికార్డునూ నెలకొల్పాడు. అదేంటంటే.. అక్కా చెల్లెల్లు అయిన ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించాడు. వారెవ్వా అనిపించాడు. ఇంతకీ ఆ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

నగ్మా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా ఘరానా మొగుడు. తెలుగు పరివ్రమలో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిది ఈ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి, నగ్మా మధ్య రొమాన్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి. నగ్మాపై చిరు పంచ్ లు, ఒకరిపై మరొకరు చేసుకునే ఛాలెంజ్ లు సినిమా రేంజిని భారీగా పెంచాయి. చిరంజీవితో పాటు నగ్మ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది.
రోషిణి
నగ్మా సోదరి రోషిణి. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. అయినా మెగాస్టార్ చిరంజీవితో జతకట్టి మాస్టర్ సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో దర్శనం ఇస్తుంది. సినిమాతో రోషిణికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా చిరంజీవికి కూడా చాలా ప్లస్ అయ్యింది.
ఠాగూర్ – జ్యోతిక
నగ్మా మరో సోదరి జ్యోతిక. ఈమె కూడా తెలుగులో చాలా సినిమాలు చేసింది. చిరంజీవితో ఠాగూర్ సినిమా కోసం జతకట్టింది. అప్పట్లో ఈ సినిమా తెలుగు పరిశ్రమ రికార్డుల్ని తిరగరాసింది. మొత్తంగా ముగ్గురు అక్కా చెల్లెళ్లతో చిరంజీవి రొమాన్స్ చేశాడు. అటు బాలయ్య ముగ్గురిలో ఇద్దరి అక్కా చెల్లెళ్లతో కలిసి నటించాడు. నగ్మాతో కలిసి అశ్వమేధం సినిమా చేశాడు. రోషిణితో పవిత్ర ప్రేమలో నటించాడు. జ్యోతికతో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
































