టాలీవుడ్ అంటేనే చిత్ర, విచిత్ర లోకం. ఏ రోజు ఏ గాసిప్ వినాల్సివస్తుందోనని సినీరంగ ప్రముఖులు కంగారు పడుతుంటే.. ఆ గాసిప్స్ చదివి పాఠకులు ఎంజాయ్ చేస్తుంటారనడానికి ఉదాహరణగా మొన్నటి వరకూ చిరు, బాలయ్య మధ్య వివాదమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడా వివాదం సద్దుమణిగిందనుకునేలోపే చిరు, రామ్ చరణ్ ల మధ్య ఆస్తి తగాదాలంటూ మరో రూమర్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యకు ..ఆయన కుమారుడు రామ్ చరణ్ కేవలం ప్యాసివ్ ప్రొడ్యూసరే అని, డబ్బు పెట్టకుండా లాభం తీసుకెళ్తున్నాడని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు వెంటనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ట్నైమెంట్స్ బృందం చెవిన పడ్డాయి. ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతున్న ఈ వార్తలను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ఖండించింది. ఈ సందర్భంగా వాళ్ళొక ప్రకటనను కూడా విడుదల చేసారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే..

“రామ్ చరణ్ కు సంభందించిన కొణెదల ప్రొడక్షన్ కంపెనీలోనూ, అలాగే మా సంస్ద నిర్మిస్తున్న చిత్రంతోనూ సమానంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రొడక్షన్ కు సంభందించిన డిస్కషన్స్, మానటరీ కంట్రిబ్యూషన్స్, ప్రొడక్షన్ అన్నీ సమానంగా మా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పంచుకుంటున్నారు. ఈ 2 సంస్దలు కలిసి సమానంగా పనిచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎవరి డ్యూటీలు వాళ్ళే చేయాలి, ఎవరు ఏ రెస్పాన్సబులిటీ తీసుకోవాలో అన్ని విషయాలను మేమందరం చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే సినిమా నిర్మాణం జరుగుతుంది” అని తెలియచేసారు. ఇంతవరకూ బాగానే వుంది. మరి రామ్ చరణ్, చిరుల మధ్య ఆస్తి కోసం తగాదాలేమిటి.? అని జుట్టు పీక్కుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..

ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ లు కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు అరగంట ఉంటుందని, అలాగే ఈ చిత్రంలో “ఖైదీ నెం 150” తర్వాత చిరుతో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తాజా సమాచారం. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సందేశాత్మక సినిమాలకు పెట్టింది పేరైన కొరటాల శివ ‘ఆచార్య’ను ఎలా తెరకెక్కిస్తున్నాడో తెలియాలంటే.. ఒక చిన్న ఉదాహరణగా ఈ చిత్ర కథలో దేవాదాయ భూముల ఆక్రమణలపై దర్శకుడు కొరటాల ఫోకస్ చేయడం ద్వారానే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు.

ఆచార్యలో రామ్‌ చరణ్‌, చిరంజీవి మధ్య ఓ ఫైట్‌ సీన్‌ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి అండర్‌ కవర్‌ అధికారిగా దేవాదాయ శాఖ అధికారి గా నటిస్తున్నాడని తెలిసింది. నక్సలైట్‌ అయిన రామ్‌ చరణ్‌ను పట్టుకోడానికి చిరు ప్రయత్నిస్తుంటాడని.. ఈ కధలో భాగంగానే తండ్రీ కొడుకుల మధ్య దేవాదాయ భూముల ఆస్తుల ఫైట్ జరుగుతుందని, అలాగే ఈ ఫైట్ సీన్‌పై డైరెక్టర్ కొరటాల శివ చాలా కేర్ తీసుకుంటూ చాలా అద్భుతంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. అదండి సంగతి.. చదివారుగా.. మొత్తానికి రియల్ లైఫ్ లో కాకుండా రీల్ లైఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదా జరగబోతుందన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here