మెగాస్టార్ చిరంజీవి అయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపై ఆసక్తికరమైన వ్యాఖలు చేసారు. సినిమాల్లో మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అన్న బాటలో రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు పవన్. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో పవన్ పాత్ర చాలానే ఉంది. ఆ సమయంలో యువరాజ్యం అధినేతగా వ్యవహరించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఎంపీ పదవీ పొందారు చిరు. అదే సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో స్వతంత్ర హోదా గల పర్యాటక మంత్రిగా పదవీ భాద్యతలు నిర్వహించారు మెగాస్టార్. అయితే ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి చిరు పూర్తీ ఫోకస్ సినిమాలపైనే పెట్టారు.

తాజగా ఒక ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖలు చేసారు. అప్పట్లో పవన్ తన ప్రజారాజ్యం పార్టీతో ప్రయాణం చేసారు. అదే సమయంలో నేను నమ్మినవాళ్ళు, చేరదీసినవాళ్లే మోసం చేసారని పవన్ భావించాడు. ఆ అనుభవాల నుంచే పవన్ జనసేన పార్టీ స్థాపించి ముందుకు తీసుకెళుతున్నాడు. మా దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే.. అలాంటప్పుడు తనదారిలో వెళ్లి నేను ఏమి సలహా ఇవ్వగలను.. ఖాళీ సమయంలో ఇంటికి వచ్చి అమ్మను కలుస్తాడు. మా అందరితో కలిసి భోజనం చేస్తాడు. మేమిద్దరం కలిసినపుడు కుటుంబ విషయాలు తప్ప రాజకీయాలు గురించి చర్చ మా మధ్య ఉండదు అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

































