ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్రజలు నానాతంటాలు పడుతున్న విషయం తెలిసిందే.. అనేక మార్గాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్నా కూడా ఆసుపత్రులలో సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్బుతమైన కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు.

రక్తం అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో మెగాస్టార్ చిరంజీవి “చిరంజీవి బ్లడ్ బ్యాంక్” ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజా విపత్కర పరిస్తితుల్లో మరోసారి గొప్ప సంకల్పంతో ముందుకు వస్తున్నారు మెగాస్టార్. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదనే సద్దుదేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు” లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసారు.
వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఈ ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపిందిచిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకాలాపాలను హీరో రామ్ చరణ్ దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది.
In the current Covid situation to prevent deaths from lack of Oxygen supply @KChiruTweets has decided to start Chiranjeevi Oxygen Banks at district level.Efforts are on to make these operational within a week's time. #Covid19IndiaHelp #ChiruForCovidhelp pic.twitter.com/9aPU56rFco
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 20, 2021



























