కష్టకాలంలో కష్టాలతో ఉన్న సినీనటులకు అండగా ఉంటున్నారు ఇటీవలే కరోనాతో మరణించిన నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి లక్షరూపాయిలు సాయం అందించారు. తాజగా ఇబ్బందుల్లో ఉన్న పావలా శ్యామలకు లక్ష రూపాయిలు సాయం అందించారు. అంతేకాదు కారావ్యాన్ డ్రైవర్ జయరాం కు కూడా ఆర్ధిక సహాయం చేసారు మెగాస్టార్ చిరంజీవి.

తాజగా గత ఏడాది నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నటుడు పొన్నాంబళంకు రెండు లక్షల రూపాయిలు సహాయం చేసారట. ఈ విషయాన్ని విడియో ద్వారా తెలియచేసారు నటుడు పొన్నాంబళం. పొన్నాంబళం తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా అనేక సినిమాలలో మనల్ని అలరించిన విషయం తెలిసిందే… “చిరంజీవి అన్నయ్యకు నమస్కారం, చాలా ధన్యవాదాలు అన్నయ్యా.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మీరు పంపించిన రెండు లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను. మీకు మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు..” అంటూ నటుడు పొన్నాంబళం ఎమోషనల్ అయ్యారు.
Boss @KChiruTweets has donated Rs.2 Lakh Rupees for Actor #Ponnambalam who is suffering with kidney problem . pic.twitter.com/De8weSmPni
— Chiranjeevi Trends™ (@TrendsChiru) May 21, 2021
































