Megastar high remuneration for Ad : మెగాస్టార్ చిరు మునుపటిలా జోరు పెంచి వరుస సినిమాలతో హడావిడి చేస్తున్నారు. ఈయన ఒక్కోసినిమా కు ప్రస్తుతం 20కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. చిరంజీవి తన సొంత ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్ నుండే సినిమాలు చేస్తున్నారు. అలా ఈయన ఒక్కో సినిమాకు 20కోట్ల వరకు తీసుకుంటున్నారట.

శుభగృహ యాడ్ కోసం అన్ని కోట్లా….
ఇక ఇటీవల చిరంజీవి గారు అనసూయ తో కలిసి రియల్ ఎస్టేట్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఇపుడు బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఏళ్ల తర్వాత చిరు మళ్ళీ యాడ్స్ చేస్తున్నారు. ఇక ఈ యాడ్ లో చిరు అనసూయ తో పాటు ఖుష్బు కుడా ఉన్నారు. ఈ యాడ్ కోసం చిరు ఏకంగా 7కోట్లా రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన ఈ యాడ్ లో చిరు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఇక ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది చిరు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇలా చిరు యమ స్పీడు మీద ఉండటం ఆయన ఫ్యాన్స్ ను హ్యాపీ చేస్తోంది.































