కరోనాపై పోరుకు నేను సైతం చిరు తల్లి స్వయంగా తానే 3 రోజులో 700లకు పైగా మాస్క్ లు..

0
537

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య నానాటికి పరుగుతున్న తరుణంలో ప్రజలంతా ప్రాణాలు చేతపట్టుకుని జీవిస్తున్నారు. మరో పక్క కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు ప్రభుత్వాలు తమ వంతు చేయాల్సిన అన్ని కార్యక్రమాలను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముఖ్యంగా రోజువారీ కూలీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అనేకం ఉన్న మన దేశంలో ఇప్పుడు మాస్క్ లు కొనుక్కోలేని పరిస్థితి. వారి ఆరోగ్యం కోసం మాస్క్ లు కొనాలని ఉన్నా పైసా ఆదాయంలేక తినడానికే లేని పరిస్థితుల్లో మాస్క్ లు కొనలేనివారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికోసం సామాజిక స్పృహ ఉన్న వారు తమకు తోచిన విధంగా సహాయం చేస్తునే ఉన్నారు. ఈ కష్ట కాలంలో కొందరు డబ్బు ఇచ్చి ఆడుకుంటున్నారు, మరి కొందరు నిత్యావసరాలు అందిస్తూ.. ఆహారాన్ని అందిస్తూ.. వారందరికి తోడుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి గారు కూడా కరోనా పై పోరాడటానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. గత మూడు రోజులుగా ఆమె స్నేహితురాళ్ళతో కలిసి స్వయంగా 700 లకు పైగా మాస్కులను కుట్టారు. వాటిని అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా తోటి మనుషుల కోసం, సమాజం కోసం తనవంతు భాద్యతను నిరవేరుస్తున్నారు. ఈ వయస్సులో తోటి మనుషుల పట్ల ఆమెకున్న సామాజిక స్పృహకు ఇవే మా జోహార్లు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here