కరోనా నేపధ్యంలో టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసిన సందర్భంగా చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ పెద్దలు టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్ కు హీరో నాగార్జున, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఎన్ కౌంటర్ శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, సీ కళ్యాణ్, దాము, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. అయితే తనకు చెప్పకుండానే వీరంతా ఆ సమావేశానికి వెళ్లడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ మంత్రితో కలిసి హైదరాబాదులోని భూములు పంచుకునేందుకే వాళ్ళందరూ సమావేశమయ్యారంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో అసలు దుమారం మొదలైంది.

బాలయ్య చేసిన సంచలన వ్యాఖ్యలకు నాగబాబుతో పాటు, హీరో వరుణ్ తేజ, తమ్మారెడ్డి, సీనియర్ నటుడు నరేష్ తదితరులు స్పందించి తమ తమ మనోభావాలను మీడియా ముందు వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.! రోజు రోజుకు ఈ వివాదం మరింత ముదిరిలా కనిపించడంతో రంగంలోకి దిగిన కొంతమంది సినీ ప్రముఖులు 
చిరంజీవి ఇంట్లోనే సమావేశమై చర్చించుకున్నారు. ఈ వివాదం ఇంతిలాగ వేడెక్కుతున్నా ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో స్పందించలేదు. ఇదే అంశాన్ని చిరంజీవి సన్నిహితులు కొంతమంది ఆయన దగ్గర ప్రస్తావించగా.. ఈ ఇష్యూపై మెగాస్టార్ చిరంజీవి ఘాటుగానే స్పందించారు.

నా తమ్ముడు నాగబాబు ఏది మాట్లాడినా సెన్సిబుల్‌గానే మాట్లాడతాడు. సెన్స్‌తోనే మాట్లాడతాడు. నా తమ్ముడు నాగబాబు వ్యాఖ్యల్ని ఖచ్చితంగా సమర్ధిస్తున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు నా తమ్ముడు. చాలా శాంతంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు. కాని తాను హర్ట్ అయితే మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడు. వెటకారంగా ఒకర్ని కించపరచాలని అనుకోడు. చాలా సంస్కారంగా, పద్ధతి గానే ఉంటాడు. కాని ఈ విషయంలో తను హర్ట్ అయ్యాడు. అందుకే ఇలా రియాక్ట్ అయ్యాడు. అదే పరిస్థితి నాకు వస్తే..  అన్నీ దిగమింగుకుని భరిస్తాను తప్ప.. ఇలా ఓపెన్ కాను. అది నా నేచర్. కాని నాగబాబు నేచర్ అది కాదు. ఎవర్నీ ఏమీ అనేటువంటి నేచర్ కానీ అవసరం కానీ మా ఫ్యామిలీకి లేదు. అటువంటి మా ఫ్యామిలీపై అనవసరంగా బురదజల్లి వెటకారంగా మాట్లాడుతూ.. కించపరిస్తూ.. సెన్స్ లేకుండా మాట్లాడితే.. తను హర్ట్ అయ్యాడు. దాని ప్రభావం మొన్న బయటపడింది. అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే ఉండొచ్చు తప్ప.. తప్పు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను.

అయినా టాలీవుడ్లో ఇటువంటి గొడవలు రావడం సహజమేనని, ప్రతి విషయానికీ స్పందిస్తూ వెళ్తే చాలా విషయాలపై స్పందించాల్సి వస్తుందని, కొద్ది రోజులు ఆగితే ఈ వ్యవహారాలు అన్నీ సర్దుకుంటాయని, బాలయ్య ఏదో ఆవేశంలో అలా అని ఉంటారని, ఆయనను కలిసి మాట్లాడితే సమస్య అక్కడితో ముగిసిపోతుంది అని మాట్లాడినట్లు సమాచారం. చిరు తన సన్నిహితుల దగ్గర చెప్పిన ఈ మాటలను బట్టి చూస్తే త్వరలోనే ఆయన బాలయ్యను కలిసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చూద్దాం.. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందో.. లేక ఇంకెక్కడికి తీసుకెళ్తుందో..?! ☺️😀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here