సిఎం జగన్ కు దాన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చిత్ర పరిశ్రమకు ఏపి సిఎం వైఎస్ జగన్ రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలో సిఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు.

“కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీకి ఉపశమనం కలిగించేలా మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది. మీ మద్దతు సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బ్రతుకుతున్న వేలాది మంది కార్మికుల కుటుంబాలకు సహాయపడుతుంది.” అంటూ తన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021




























