“మా అమ్మ దగ్గర నీ బట్టర్ ఉడకదురా బచ్చా…” చరణ్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

0
257

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సెలెబ్రెటీస్ అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ వీడియో లు, ఫోటోలు తీసుకుని తమ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నిన్న రామ్ చరణ్ తన నాయనమ్మతో వెన్నతీస్తూ మంచి మార్కులు కొట్టేపని చేసాడు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అయితే ఇప్పుడు దానిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చరణ్ పెట్టిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అయన మార్క్ కామెడీ జోడించి పోస్ట్ చేసారు.

“మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్ బటర్ ఎంత మంచిగా తీసినా, నీ స్తానం మాత్రం బటర్ అవ్వదు” అంటూ తన మార్క్ రైమింగ్ తో కామెంట్ చేసారు. అంతేకాదు “కానీ అదే ఫస్ట్ ప్లేస్ గ్యారెంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో.. ” అంటూ చమత్కారం జోడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here