హీరోయిన్ మెహ్రిన్… ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటోంది.. తాజగా ఈ భామ హీరో నాగసౌర్య సరసన “అశ్వద్ధామ” సినిమాలో కధానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లకు ఆమె గైర్హాజరవడంతో చిత్ర నిర్మాతలు హోటల్ బిల్లులు కట్టనని బెదిరించినట్టుగా వస్తున్న వార్తలపై ఇప్పుడు ఈ భామ స్పందించింది.

“అశ్వద్ధామ” చిత్రం హీరో నాగసౌర్య తన సొంత బ్యానర్ “ఐరా క్రియేషన్స్” ద్వారా నిర్మించారు. ఈ బ్యానర్ కు సంబంధించిన వ్యవహారాలు అయన తల్లిదండ్రులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెహ్రిన్ కు 65 లక్షల రెమ్యూనరేషన్ ను ఫిక్స్ చేశారట. ముందుగా మాట్లాడుకున్నట్టుగా 55 లక్షలు ముందుగా ఇచ్చేశారట. మిగిలిన 10 లక్షలు సినిమా ప్రమోషన్స్ అయిపోయిన తరువాత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారట.

అయితే సినిమా పూర్తి అయ్యాక తనకు హెల్త్ ఇస్స్యూస్ ఉన్నాయని చెప్పి “అశ్వద్ధామ” ప్రమోషన్లకు హాజరుకాకుండా ఎగ్గొటేసిందట. ఈ విషయంపై ప్రొడ్యూసర్, నాగసౌర్య తండ్రి మెహ్రిన్ పై ఫైర్ అయ్యారట. నీ హోటల్ కోసం మరియు ఇతరత్రా ఖర్చులకోసం మేము ఇంత ఖర్చు చేస్తుంటే నువ్వు ప్రమోషన్లకు రాకపోతే ఎలా అని మెహ్రిన్ మీద సీరియస్ అయ్యారట. ప్రమోషన్లకు రాకపోతే హోటల్ బిల్ కట్టనని బెదిరించారట. దీనితో చెప్పాపెట్టకుండా సైలెంట్ గా హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయిందట మెహ్రిన్. ఇక చేసేది ఏమిలేక నిర్మాత హోటల్ బిల్ కట్టాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని మెహ్రిన్ మేనేజర్ అంగీకరించారు.
అయితే ఇప్పుడు మెహ్రిన్ ఈవిషయంపై ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది.

హోటల్ బిల్స్ గురించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలు నన్ను చాలా బాధించాయి. నేను ఇప్పటి వరకు 14 చిత్రాలలో నటించాను . కొన్ని సందర్భాలలో అనారోగ్యంతో ఉన్నాకూడా సినిమా కోసం వాటన్నిటినీ పక్కనపెట్టి ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు నాపై ఇటువంటి ఆరోపణలు రాలేదు. సంక్రాతి తరువాత నేను నా కుటుంబాన్ని చూడటానికి పంజాబ్ వెళ్ళాను. అశ్వద్ధామ విడుదలకు కొద్దిరోజుల ముందు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ తిరిగి వచ్చాను. అయితే మా తాతగారి గుండెపోటు వల్ల నేను హైదరాబాద్ రావడం కొంచెం ఆలస్యం అయింది. ఈ విషయాన్నీ నా సహా నటుడు నాగసౌర్య అయన ఇంటర్వ్యూలలో తెలిపారు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత నేను సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నాను. అయితే నాకు స్కిన్ అలర్జీ వచ్చి మొహం అంతా దద్దుర్లు రావడంతో కేవలం ఒక ఇంటర్వ్యూలో పాల్గొనలేకపోయాను. దానికి సంబందించిన డాక్టర్ ప్రిస్క్రిప్సన్ తో పాటు ఫోటో కూడా నిర్మాతలకు పంపాను. నేను రాలేకపోతున్నందుకు క్షమాపణ కూడా అడిగాను. అయినా కూడా నిర్మాతలు అది అర్ధం చేసుకోకుండా నా హోటల్ బిల్ కట్టడానికి నిరాకరించారు. నా సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదు. ఆ తరువాత నేను వారితో మాట్లాడి చెల్లిచమని కోరిన తరువాత నిర్మాతలు హోటల్ బిల్ పే చేసి, నా సిబ్బందికి జీతాలు ఇచ్చారు.

నేను పనిచేసిన 14 సినిమాల్లో ఎప్పుడూ నిర్మాతలతో నాకు ఫైనాన్సియల్ డిఫరెన్సెస్ రాలేదు. అయితే కొన్ని ఆర్టికల్స్ లో నా హోటల్ బిల్లులు, ఆహారం, లాండ్రీ బిల్లులు ప్రస్తావించడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. నా క్యాస్త్యుమ్ స్టైలిస్ట్ జీతంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది నేరుగా ప్రొడక్షన్ హౌజ్ తో జరుగుతుంది. నా వృత్తి పట్ల నన్ను కించపరిస్తే నేను సైలెంట్ గా ఉండలేను. అశ్వద్ధామ చిత్రంలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఐరా క్రియేషన్స్ వారికి నేను కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యతులో వారు నిర్మించే చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇకపై ఈ విషయం నేను ఎక్కడ ప్రస్తావించాలని అనుకోవడంలేదు. అంటూ ట్వీట్ చేసింది మెహ్రిన్..
My Statement ???????????? pic.twitter.com/1lvEuwuIYD
— Mehreen Pirzada???? (@Mehreenpirzada) February 24, 2020



























