Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ గారికి ఫిబ్రవరి 7వ తేదీన మధ్యాహ్నం సమయంలో హటాత్తుగా గుండెపోటు రావడంతో నెల్లూరుకు చికిత్స నిమిత్తం తరలించి ఆపైన మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉండగా హాస్పిటల్ లో ఇంకా చికిత్సలో ఉంటూనే యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తనకు గుండెపోటు రావడానికి గల కారణాలను అలాగే కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

కుటుంబంలో వాళ్ళ వల్లే కలహాలు…
నిరంతరం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలకు దగ్గగరగా ఉండేవాడిని అంటూ మేకపాటి చంద్రశేఖర్ గారు అభిప్రాయపడ్డారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాకు ఈ పరిస్థితి రావడాని కారణం నా రాజకీయ ప్రత్యర్థులు పెడుతున్న మానసిక క్షోభ అలాగే కుటుంబలోని కలహాలు అంటూ తెలిపారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మామూలే కానీ ఆ గొడవలను తగ్గించే వారు తక్కువై పెంచేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సలహాదారుల వల్లే అనర్థాలు వచ్చాయంటూ అందువల్లే ఇలా ఎక్కువ బాధపడి గుండెపోటు వచ్చిందంటూ చెప్పారు.

ఆల్రెడీ ఒకసారి స్టంట్ వేశారని, మరోసారి ఇప్పుడు స్టంట్ వేసారంటూ చెప్పారు. ఇక తన రెండు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఘటన, ఈ విషయం నేను దాచిపెట్టింది కాదు అందరికీ తెలుసు. ప్రస్తుతం నా రెండో భార్య శాంత కుమారి అలాగే మాకు పుట్టిన అమ్మాయి మాత్రమే నా కుటుంబం అలాగే బ్రతుకుతున్నాం. నాకు కరోనా సమయంలో కానీ ఎటువంటి ఇబ్బందుల్లో కానీ తోడుంది శాంత కుమారి నే అంటూ చెప్పారు.





























