“అన్నయ్యా.. బాబికి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా?” హెయిర్ కట్ పై అన్నా చెల్లెళ్ళ ఇంట్రస్టింగ్ సంభాషణ… !!

0
341

మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు.. హెల్ప్ అని అడగటమే ఆలస్యం వెంటనే స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు సూచిస్తారు. అంతేకాదు మరికొన్ని సరదా ట్వీట్లకు తనదైన శైలిలో పంచులు కూడా వేస్తుంటాడు. తాజగా అటువంటి సంఘటనే జరిగింది. నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్ వెరైటీ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి కల్వకుంట్ల కవిత ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనితో ఒకేసారి లైకులు, రీట్వీట్లతో హోరెత్తిపోతోంది ట్విట్టర్.

వివరాల్లోకి వెళితే… “ఏప్రిల్ 20 తరువాత అయినా హెయిర్ కటింగ్ షాపులు తెరిచే సూచనలు ఉన్నాయా అంటూ ట్వీట్ చేసారు శరత్ చంద్ర అనే నెటిజన్. దీనికి మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు. “టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అయన భార్య అనుష్క శర్మ హెయిర్ కట్ చేసింది… అలాంటపుడు నువ్వెందుకు చేసుకోవు” అంటూ ఫన్నీ గా ట్వీట్ చేసారు.

అంతే ఈ ట్వీట్ చుసిన కవిత “అన్నయ్యా… బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా?” అంటూ ఆసక్తికర రిప్లై ఇచ్చారు.. అంతే ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. ఈ అన్నా, చెల్లెల్ల సంభాషణకు అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు.. పంచ్ మాస్టర్ కె పంచ్ పడిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు…