Roja got emotional on jabardasth sets : సినీ హీరోయిన్ గా వందకుపైగా సినిమాలలో హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న రోజా, తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఇక పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలతో మెరిపించిన రోజా బుల్లితెర లోకూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఇక మా టీవీలో ప్రసారమయ్యే మోడరన్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ చేసారు. ఏ షో లో పెద్దగా రాణించక పోయిన ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం మొదలుపెట్టాక జడ్జి గా రోజా, నాగబాబు ను తీసుకున్నారు. ఇక ఈ షో తో ఎంతోమంది ఆర్టిస్టుల జీవితాలే కాకుండా జడ్జిలాగా వచ్చినా నాగబాబు, రోజా జీవితాలు మారిపోయాయి. రోజా నాగబాబులకు జబర్దస్థ మళ్ళీ లైఫ్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ షో తనకు అచ్చోచ్చిందని రోజా ఎన్నోసార్లు చెప్పారు. ఇక నాగబాబు 2019 లో జబర్దస్త్ ను ఇతర కారణాలతో వదిలేసారు. అయిన రోజా జబర్దస్త్ లో కొనసాగారు. దాదాపు 10ఏళ్ల ప్రస్థానంలో జబర్దస్త్ తో మంచి అనుబంధం ఉంది. ఇక ఇపుడు రోజా జబర్దస్త్ కు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు తీసుకున్న రోజా సినిమాలు, జబర్దస్త్ ను వదులుకోవాల్సి వచ్చింది. ఇక తన చివరి షో తాలూకు ప్రోమోను ఈటీవీ జబర్దస్త్ ప్రసారం చేసారు. ఇక ఈ ప్రోమోలో రోజా ఎమోషనల్ గా ఈ వేదిక పైనే రెండూ సార్లు ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయినా ఈ వేదిక మీదే అవ్వాలని అనుకున్న అంటూనే.. కానీ సేవ చేయడం కోసం ఇష్టమైనవీ వదులుకోవాల్సి వస్తోంది అని రష్మీ చేయి పట్టుకుని ఎమోషనల్ అవ్వడం చూపించారు. ఇక 10ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు పలకాలంటే ఆ మాత్రం బాధ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.



























