Minister Roja : సెలబ్రిటీలు అనగానే ఫాలోయింగ్, అభిమానులు వారి ప్రేమ సెలబ్రిటీల కష్టానికి ప్రతిఫలంగా లభిస్తాయి. సినిమా వాళ్లకు ఉన్న క్రేజ్ మరెవరికి ఉండదు. అందుకే ఎంతో మంది ఆ రంగుల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రాయ పడుతారు. ఇకపోతే ఆర్కే రోజా సెల్వమణి.. తెలుగు ప్రజలకు తెలియని వ్యక్తి కాదు. అటు హీరోయిన్ గా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న రోజా ఆ తరువాత బుల్లితెర మీద అల్లరించింది. ఇక పోతే రాజకీయ ప్రవేశం చేసి సమాజ సేవ చేస్తోంది.

నా పిల్లలకు ఆ అదృష్టం లేదు…
జబర్దస్త్ నిజానికి రోజాకు పునర్జన్మను ఇచ్చింది. మళ్ళీ తనను అందరికి దగ్గర చేసింది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేదు. అయితే అటు రాజకీయ ప్రవేశం చేసిన ఇంకా సక్సెస్ చూడలేదు. అటువంటి సమయంలో జబర్దస్త్ ఆమెను ఆదుకుంది. ప్రేక్షకులకు మళ్ళీ రోజాను దగ్గరచేసింది. మంత్రి అయ్యే వరకు రోజా జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహారించారు. కానీ మంత్రి గా తన బాధ్యతలు పెరగడం వల్ల ఇక జబర్దస్త్ వీడాల్సి వచ్చింది. ఇక దసరా పండుగ సందర్బంగా మరోసారి బుల్లితెర మీద కనువిందు చేసారు.

చాలా రోజుల తరువాత రోజా గారు ఈటీవీ వారి పండుగ ఈవెంట్లో కనిపించారు. ఇక ఈవెంట్లో డాన్స్ లు స్కిట్లు అంటూ మంచి హడావిడి కనిపిస్తోంది. పండగ ఈవెంట్ అనగానే మల్లేమాల పెట్టింది పేరు ఇక దసర ఈవెంట్ కూడా అలాగే ఉండబోతోంది. ఇక ప్రోగ్రామ్ కి సంబంధిచిన ప్రమోను వదిలారు మల్లె మాల వారు. అయితే అందులో చివర్లో రోజా గారు ఎమోషనల్ అయి అందరిని ఏడపించేశారు. ఒక స్కిట్ ను చూస్తూ నా పిల్లలకు అందరి పిల్లల లాగా అమ్మ చేత్తో తిని పెరిగే అదృష్టం లేకపోయింది, అందరికి కోవిడ్ కష్టమైన కాలం కానీ నాకు మాత్రం చాలా హ్యాపీ పీరియడ్ నా పిల్లలతో ఉన్నాను అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

































