దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో స్కూల్స్ సైతం మూసి వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో దియేటర్లు మూసివేసే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

దియేటర్లు మూసివేసే ఆలోచన తమకు లేదని తెలిపారు మంత్రి తలసాని. అదే విధంగా సీటింగ్ పై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా దేబ్బతిన్నాదని, మరో సారి దియేటర్లు మూసివేత దిశగా వెళ్తే సినీ పరిశ్రమకు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని, అదే జరిగితే వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అన్నారు మంత్రి తలసాని.



























