ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని.. తన కోరిక తీర్చాలని వేధించాడు. చివరకు అతడి వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మైనర్ బాలికలపై అత్యాచారాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించడం లేదని కొందరు.. కామంతో ఉండి మరి కొందరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

అలాంటిదే ఖమ్మంలో చోటు చేసుకుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన 17 ఏళ్ల కుసుమరాజు వర్షిత తండ్రి మరణించడంతో కుటుంబభారం మొత్తం ఆపెపైనే పడింది. దీంతో ఆమె స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిలో చేరింది.
అక్కడే ఆమె గత కొన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తుండగా.. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న తిరువూరు మండలం.. మునుకోళ్ల గ్రామానికి చెందిన వల్లవరపు మధుకుమార్ పని చేస్తున్నాడు. ఆమెను ప్రతీరోజు ప్రేమిస్తున్నానని..తనను కూడా ప్రేమించాలని.. వేధింపులకు గురిచేసేవాడు. అంతేకాకుండా తన కోరిక తీర్చాలంటూ వెంటపడే వాడు.
ఇలా వేధింపులు పెరగడంతో వర్షిత ఇటీవల మరో ఆసుపత్రిలో చేరింది. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితురాలికి ఫోన్ చేయండంతో వెంటనే ఆ అమ్మాయి.. వర్షిత తల్లికి ఫోన్ చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శవం పక్కన ఇంజక్షన్, సిరంజీ ఉండటతో ఆమె విషం ఎక్కించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. విషం తెలుసుకున్న పోలీసులు మధుకుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. అతడు పరారీలో ఉన్నాడు.































