Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథనాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. అయితే కొన్ని సినిమాలను పాత్ర బాగోలేదనో లేకపోతే నిడివి లేదనో నిర్మొహమాటంగా వద్దని వచ్చేసారు మాధవి.

అర్జున్ రెడ్డి లో అందుకే చేయలేదు…
సినిమాల్లో బిజీగా ఉన్నపుడు ఒక్కోసారి సర్ధుబాటు చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయాల్లో మరో పాత్రను వదులుకోవాల్సి వస్తుంది. అలా అర్జున్ రెడ్డి సినిమాలో నర్స్ పాత్ర కోసం నన్ను అడిగినపుడు వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ ఒక మంచి సినిమాను మిస్ అయ్యాననిపిస్తుంది అని మాధవి చెప్పారు. ఇక ఒక సినిమా కోసం ప్రకాష్ రాజ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ కి నన్ను తీసుకున్నారు. నేను బాగుంటుందని ఒకే చేశాను. చూస్తే చాలా చిన్న పాత్ర ప్రకాష్ రాజ్ గారి కూతురిగా అందులో అనుపమ పరమేశ్వరన్ చేసారు. ఇక అక్కడికి వెళ్ళాక ఆ పాత్ర చాలా చిన్నది అని అర్థమైంది అందుకే చేయనని వచ్చేసాను. అయితే గొడవ పడలేదు కానీ ఒకసారి అలాంటి ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తే మళ్ళీ అలాంటి అవకాశలే వస్తాయి అందుకే వద్దనుకున్నాను. ఇక ఫుడ్ విషయంలో ఎప్పుడూ ఇబ్బందులే నాకు. అవుట్ డోర్ షూటింగ్ సమయంలో నేను శాకాహారిని అవ్వడం వల్ల ఫుడ్ సరిగా దొరకదు. ఇక ఇతర దేశాలకు వెళ్ళినపుడు ఇబ్బందులు తప్పవు.

ప్రొడక్షన్ వాళ్ళు పెట్టే భోజనం కూడా అటు ఇటు గా నాన్ వెజ్ ఉండడం వల్ల ప్రతి సారి ఇబ్బందులు తప్పవు. హైదరాబాద్ లో షూటింగ్ అంటే ఖచ్చితంగా ఇంటి నుండి భోజనం తీసుకుని పోతాను. అవుట్ డోర్ షూటింగ్ అయితే ఖచ్చితంగా కొంచెం సన్నబడి వస్తాను అంటూ చెప్పారు. ఒక చిన్నసినిమా కోసం విజయవాడ లో పని చేస్తున్నపుడు కో డైరెక్టర్ నా మీద అరిచాడు, రీల్ ముందు పని చేయించుకోడానికి డామినేట్ చేస్తే షూటింగ్ అయ్యాక కాదని తిట్టి వచ్చేసాను అంటూ మాధవి తన సినిమా విశేషాలను చెప్పారు. రెమ్యూనరేషన్ విషయంలో చాలా పట్టుతో ఉంటానని ఇదివరకు చాలా సార్లు డబ్బులు ఎగ్గొటిన వాళ్ళు ఉన్నారు అందుకే రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా ఉంటానని మాధవి తన సినిమా అనుభవాలను పంచుకున్నారు.



























