Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీ గా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాలే కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న మిర్చి మాధవి మా టీవిలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది.

చందన్ ను అందికే బ్యాన్ చేసారు…
ఇటీవలే టీవీ యాక్టర్ చందన్ ప్రొడక్షన్ యూనిట్ తో దురుసు ప్రవర్తన కారణంగా బ్యాన్ ఎదుర్కొన్నాడు. ఇక ఒక నటిగా ఇలాంటి విషయాల్లో తప్పు ఎవరిది అనే అంశం మీద మిర్చి మాధవి మాట్లాడారు. సీరియల్ షూటింగ్ కి సినిమా షూటింగ్ కి చాలా తేడా ఉంటుంది. ఇక షూటింగ్ సెట్ లో ఒక్కోసారి త్వరగా షూటింగ్ జరుగుతుంటుంది, వెంట వెంటనే సీన్స్ షూటింగ్ జరుగుతుంటాయి. అయితే వెంట వెంటనే సీన్స్ షూట్ అయినపుడు ఆర్టిస్ట్ కి ఇబ్బంది గా ఉంటుంది, కానీ ప్రొడక్షన్ కాస్ట్ గురించి కుడా ఆలోచించాలి. కొన్ని సార్లు మనం నటించాల్సిన సీన్ లేట్ అవుతూ ఉంటింది వేరే కారణాల వల్ల అప్పుడు వేచి ఉండాల్సి ఉంటుంది, ఇవన్నీ సాధారణంగా జరిగేవే. అయితే షాట్ రెడీ అయ్యాక మొత్తం సెట్ ను వెయిట్ చేయించడం అది కూడా ఐదు పది నిముషాలు కుడా కాదు ఏకంగా గంట అర్ధగంట బ్రేక్ అన్నపుడు ప్రొడక్షన్ యూనిట్ కి కోపం వస్తుంది. చందన్ విషయంలో అదే జరిగింది. షూట్ కి సిద్ధమయ్యాక అర్ధ గంట వెయిట్ చేయించాడు. మళ్ళీ వెళ్లి ప్రొడక్షన్ మెంబెర్ వెళ్లి అడిగితే మాట మాట పెరిగి గొడవ జరిగి చేయి చేసుకునే వరకు వెళ్లడం, బ్యాన్ అవ్వడం జరిగింది. ఒక సినిమా షూటింగ్ అయినా సీరియల్ షూటింగ్ అయినా సర్దుబాట్లు ఉండాలి. అలాగే ఆర్టిస్టులను ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడక్షన్ యూనిట్ ని ఆర్టిస్టులు అర్థం చేసుకోవాలి అంటూ మాధవి అభిప్రాయపడ్డారు.

నమ్మిన వాళ్లే మోసం చేసారు…
మనం ఎంత చురుగ్గా అలర్ట్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఎదుటి వాళ్లను నమ్మి మోసపోతాము. నాకు స్టాక్స్ గురించి అంత అవగాహన లేకపోతే ఇంట్లో వాళ్లే కదా అనే నమ్మకం తో తెలిసిన వ్యక్తికి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఐదు లక్షలు సర్దుబాటు చేసి ఇచ్చాను కానీ మోసపోయాను. నా డబ్బు పోవడం కంటే తెలిసిన వాళ్ళే ఇలా చేశారే అనిపించింది. ఇక ఇప్పటికి లక్ష రికవర్ అయింది మిగిలినది చేసుకోవాలి అంటూ చెప్పారు.



























