Mirchi Madhavi : సోషల్ మీడియా పుణ్యమా అని తమకు నచ్చినట్టు సెలబ్రిటీలను మరింత చేరువయ్యారు ప్రేక్షకులు. అయితే ఎంత పాజిటివిటీ సోషల్ మీడియా ద్వారా ఉందో అంతే నెగెటివిటీ కూడా ఉంది. మనం చేసే పనులు కొంత మందికి నచవచ్చు కొంత మందికి నచ్చకపోవచ్చు. వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ వంటివి ఎదురుకొంటున్నారు, మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమా, టీవీ రంగంలో ఉండే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తమ జీవితాన్ని చూపిస్తూ ట్రోల్స్ అనే అస్త్రాన్ని పబ్లిక్ ఇస్తున్నారు. ఇక ఎంత వరకు మనం జీవితాన్ని పబ్లిక్ లో ఉంచాలి లేదు అనేది మన వ్యక్తిగత అంశం. అయితే దానివల్ల వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మంచైనా, చెడైనా. ఇక ఈ విషయాలపై సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేతున్న మిర్చి మాధవి స్పందించారు.

అడిగేవారు లేకపోతే, భయం భక్తి లేకపోతే ఇలాగే ఉంటుంది…
తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవి సినిమాలకంటే ముందు ఆర్జే గా పనిచేయడం వల్ల మిర్చి మాధవి గా బాగా ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం మిగిలిన ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న నెగెటివిటీ గురించి మాట్లాడుతూ ప్రగతి, సురేఖ వాణి వంటి వారు సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా పెడుతుంటారు దీనివల్ల వారు ట్రోల్ల్స్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీని గురించి మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పాలనుకోవడం వారి సొంత విషయం దాన్ని గురించి మాట్లాడకూడదు. అయితే ఒకసారి మనం వ్యక్తిగత జీవితాన్ని నెట్టింట్లో పెట్టి మళ్ళీ కామెంట్స్ ఎలా ఉన్నా బాధపడకూడదు భరించాల్సిందే అని నేను భావిస్తాను. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉంది దాని ద్వారా నా చదువు ఇలాంటివి ఒకరికి ఉపయోగపడాలని వీడియోస్ చేశాను మధ్యలో బిజీ అవ్వడం వల్ల మానేసాను.

కానీ కామెంట్స్ లో నువ్వు చెబితే మేము వినాలా చాల్లే వంటి కామెంట్స్ చూసినపుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉండేవారు బయట ఉంటారో అని అనిపిస్తుంది. అయితే నేను నా వ్యక్తిగత జీవితాన్ని ఎపుడు పబ్లిక్ చేయలేదు. ఎందుకంటే నా కుటుంబం, మా అన్నయ్య యూకే లో ఉంటారు. అయన నాకు ఉన్న ఐదు మంది బాబాయ్ లు అందరూ వెంటనే అడుగుతారు ఏంటి ఇలా పెట్టావ్ అని ఆ భయం నాకు ఉంది అందుకే అలాంటివి ఆలోచించను. ఆ భయం, భక్తి ఉంటే మనం పర్సనల్ లైఫ్ ఎంతవరకు బయటికి చెప్పాలో అంతే చెప్పాలి అనే లిమిట్ ఉంటుంది. లేకపోతే పబ్లిక్ మాట్లాడే మాటలను వినాల్సి వస్తుంది అంటూ మాధవి చెప్పారు.



























