ప్రముఖ సినీ నటి రోజా ప్రస్తుతానికి అటు రాజకీయాల్లోనూ.. ఇటు టీవీ షో లతోనూ క్షణం తీరిక లేకుండా బిజీగా వున్నారు. నగరి నియోజక వర్గం నుండి 2వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా ఆంధ్రాలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకి మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ కొన్ని రాజకీయ కుట్రల వలన రోజాకి మంత్రి పదవి దక్కలేదు. అయితే ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్న రోజాకి క్యాబినెట్ హోదాతో సమానమైన ఒక నామినేటెడ్ పదవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పగించిన విషయం తెలిసిందే.

ఇదిలా వుండగా లేటెస్ట్ గా అందిన న్యూస్ ఏమిటంటే రోజా మరోసారి వెండితెరపై తన వెలుగుజిలుగులను ప్రదర్శించడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఒక పెద్దసినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించడానికి రోజా ఒప్పుకున్నారని లేటెస్ట్ అప్ డేట్. అయితే ఆ పాత్రకు రోజా అయితేనే న్యాయం చేస్తుందని నమ్మకంతో దర్శక నిర్మాతలు రోజాని సంప్రదించారని అందుకు రోజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం, అయితే ఒకవైపు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న రోజా ఇక ప్రస్తుతానికి తన పదవి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరొక వైపు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమౌతున్నారంటే రోజానా మజాకా..! మరి తాజాగా రోజా నటించబోయే ఆ సినిమా వివరాలతో అతి త్వరలోనే మీ ముందుంటుంది మా TELUGUDESK.




























