Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఈసారి టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఆయన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు అంటూ కొనియాడారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించే సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించేవారని పేర్కొన్నారు. ఇలా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి అదే విధంగా పలువురు బాలీవుడ్ నటీనటుడు దర్శకుల గురించి కూడా ఈ కార్యక్రమంలో మోడీ ప్రస్తావిస్తూ వారిపట్ల ప్రశంసలు కురిపించారు.

ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఏఎన్ఆర్ పేరును ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ పేరును మర్చిపోయారు దీంతో ఎన్టీఆర్ అభిమానులు మోడీ పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లినటువంటి వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారని చెబుతూ ఉంటారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.
— TeluguDesk (@telugudesk) December 29, 2024
ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని…మన్ కీ బాత్‌లో పలు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల… pic.twitter.com/y6DOvnJZOu
ఇండస్ట్రీకి రెండు కళ్ళు..
ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏఎన్నార్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ కనీసం ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించకపోవడం పట్ల అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.

































