Mohan Babu : డైలాగు కింగ్ మోహన్ బాబు తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఎన్నో సినిమాల్లో విలనిజాన్ని అద్భుతంగా పండించారు. ఇక హీరోగా కూడా ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయి అగ్రహీరోల సరసన నిలిచారు. ఇక కెరీర్ మొదట్లో కామెడీ విలన్ పాత్రలు చేసిన మోహన్ బాబు ఇటీవలే ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కూతురు లక్ష్మి ప్రసన్న కూడా సినిమాల్లో నటించారు. అలా మంచు వారి ఫ్యామిలీ టాలీవుడ్ లో బాగా గుర్తింపు ఉన్న కుటుంబం.

గుడి కట్టించిన మోహన్ బాబు…
ఇక విద్యారంగంలో కూడా మోహన్ బాబు కృషి చేసారు. ఆయన విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఎంతో మందికి మంచి చదువు అందిస్తున్నారు. ఇక ఆయన సాయిబాబాకి పరమ భక్తుడు. ఏ పని చేసినా ఆ సాయి బాబా ను తలుచుకొని చేస్తారు. ఇక ఆ భక్తి తోనే తిరుపతి వద్ద రంగంపేట లో సాయి బాబు గుడిని నిర్మిస్తున్నారు. ఇక ఈ గుడి గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఈ సాయి బాబా దేవాలయం దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద దేవాలయం అని చెప్పారు. తిరుమల దర్శనం అయ్యాక భక్తులు ఈ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేలా ఆలయం నిర్మించండి లేకపోతే అసలు నిర్మాణం చేయవద్దు అని పెద్ద కొడుకు విష్ణు చెప్పారట. ఇక నేడు ఆలయంలో హోమాలు జరుగుతున్నాయి, ఆలయ శిల్ప కళ, నిర్మాణం చూడడానికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్లి ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం మోహన్ బాబు ఆయన సతీమణి తో కలిసి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
































