తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వందల సినిమాల్లో నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అతడి వారసత్వాన్ని ప్రస్తుతం తన కుమారులు ఇద్దరు రన్ చేస్తున్నారు. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైనా సంగతి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.

అయితే తాజగా అతడి ఇంట్లో ఉదయం పూట విషాద ఛాయలు అలుకున్నాయి. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు 63 ఏళ్ల రంగస్వామి నాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. అతడు గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి ఆ రోజు నుంచి చికిత్స అందిస్తున్నా ఉపయోగం లేకుండా అయింది. దీంతో అతడు నేడు ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచాడు.
ఇక రంగ స్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. తిరుపతిలో అతడి అంత్యక్రియలను రేపు అనగా గురువారం ఉదయం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త వినగానే చాలామంది షాక్ కు గరుయ్యారు. పలువురు సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అతడు ఆరోగ్యంగా ఉన్న సమయంలో మోహన్ బాబు చేపట్టే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తిరుపతిలోనే ఉంటూ అతడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అతడి మరణ వార్త విన్న మంచు ఫ్యామిలీ హుటాహుటిన తిరుపతి బయలుదేరి వెళ్లారు. మోహన్ బాబు వెన్నంటి ఉండే అతడు ఇలా లోకాన్ని విడిచి పోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.





























