పిల్లలు పుట్టకపోవడానికి భార్య-భర్తలలో ఈ సమస్యలే ప్రధాన కారణం!

0
258

పెళ్లి అయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని ఎంతో ఆశ పడుతుంటుంది. తల్లి కావడం స్త్రీ జీవితంలో ఎంతో అపురూపమైన క్షణం. అమ్మ తనం అనేది మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. అలాంటి అమ్మతనాన్ని పొందడానికి ప్రస్తుత కాలంలో ఎంతో మంది లక్షల్లో డబ్బు ఖర్చు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఈ కాలంలో పెళ్లి అయిన జంటలు కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు పిల్లల గురించి ఆలోచించడం లేదు.తరువాత పిల్లల కావాలన్నా వారికి సంతానం కలగకుండా ఎంతోమంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.మరి కొంతమందికి పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులలోనే సంతానం కలుగుతుంది. మరికొంత మందికి పిల్లలు కలగకపోవడానికి కొన్ని ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. అయితే పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగక పోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

పెళ్లయిన తర్వాత సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణం ఆడవారిలో 33 శాతం ఉంటే, మగవారిలో ఈ సమస్య 33 శాతం ఉంటుంది. ఇతర కారణాల వల్ల 34 శాతం మందికి సంతానం కలగడం లేదు. పెళ్లైన 5_6 నెలలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే పెళ్లయిన సంవత్సరానికి గర్భం దాల్చే అవకాశాలు కేవలం 75 శాతం మాత్రమే ఉంటుంది. పెళ్లయి 3_4 సంవత్సరాలు గడిచిన వారిలో గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ఇక సంతానం కలగకపోవడానికి మగవారిలో ఎక్కువగా మద్యం సేవించే వారిలో, పొగ త్రాగడం, ఎక్కువగా గతుకులు ఉన్న రోడ్లపై ప్రయాణాలు చేసే వారిలో, శరీరానికి ఎక్కువ వేడి ఉండే పరిశ్రమలలో పని చేయడం, గజ్జలలోని హెర్నియా చికిత్స జరిగి ఉన్నవారిలో ఎక్కువగా పిల్లలు కలగక పోవడానికి ఆస్కారం వుంటుంది. అలాగే ఆడవారిలో గర్భం దాల్చడానికి 18 నుంచి 36 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో గర్భం దాల్చడానికి సరైన సమయం అని చెప్పవచ్చు.36 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా గర్భాశయ, అండాశయ సమస్యలు ఏర్పడతాయి.అంతేకాకుండా అండాలు విడుదల అయ్యే ఫాలోపియన్ ట్యూబులలో సమస్యలు ఏర్పడటం వల్ల సంతానం కలగకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.